Vasantha panchami 2024: వసంత పంచమి రోజు అమ్మవారికి ఈ నైవేద్యాలు సమర్పిస్తే ఆటంకాలు తొలగిపోతాయ్
Vasantha panchami 2024: వసంత పంచమి రోజు సరస్వతీ దేవి అనుగ్రహం పొందటానికి ఈ నైవేద్యాలు సమర్పించండి. వృత్తిలో, చదువులో ఎదురయ్యే ఆటంకాలు అన్ని తొలగిపోయి అదృష్టం వరిస్తుంది.
ఫిబ్రవరి 14వ తేదీన వసంత పంచమి రోజున ఈ నైవేద్యాలను సమర్పిస్తే పనులలో ఆటంకాలు తొలగిపోతాయి. చదువుకొనే పిల్లలు బాగా చదువుతారు. సరస్వతి దేవి అనుగ్రహం కోసం పసుపు రంగు నైవేద్యాలను సమర్పించాలి.
వసంత పంచమి రోజు శనగపిండి లడ్డూను సమర్పించడం వల్ల సరస్వతీ దేవి అనుగ్రహం లభిస్తుంది. సరస్వతీ దేవితో పాటు దేవగురువు బృహస్పతి, విష్ణువు అనుగ్రహాలు కూడా లభిస్తాయి.
బూందీ లడ్డును సమర్పిస్తే సకల బాధలు తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్మకం.
మాల్పువాను సమర్పిస్తే పిల్లలకు చదువులో, పెద్దలకు వృత్తిలో ఆటంకాలు ఎదురు కావు.
అమ్మవారికి పరమాన్నం ప్రీతి కనుక పరమాన్నంను నైవేద్యంగా పెడితే కోరికలు నెరవేరతాయి.
సరస్వతీ దేవికి ఇష్టమైన మరొక ప్రసాదం రాజ్ భోగ్. పాలతో చేసే ఈ పదార్థం అమ్మవారికి ఎంతో ప్రీతిప్రాతమైనది. రాజ్ భోగ్ సమర్పించడం వల్ల అదృష్టం పెరుగుతుందని నమ్ముతారు.

