Beauty TipsHealthhealth tips in telugu

పాదాల పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా? ఇంట్లోనే ఈ ఒక్క చిట్కాతో పగుళ్లు మాయం!

Cracked Heels In Telugu : పాదాల పగుళ్లు (Cracked Heels) అనేవి కేవలం అందాన్ని తగ్గించడమే కాకుండా, కొన్నిసార్లు తీవ్రమైన నొప్పిని, మంటను కూడా కలిగిస్తాయి. వాతావరణ మార్పులు, తేమ తగ్గడం, సరైన సంరక్షణ లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంటుంది.

అయితే దీని కోసం పార్లర్‌కి వెళ్లి ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన వస్తువులతోనే పాదాలను మృదువుగా, అందంగా మార్చుకోవచ్చు.

ఈ పోస్ట్‌లో రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే సులభంగా చేసుకునే హోమ్ మేడ్ పెడిక్యూర్ మరియు పగుళ్లను వేగంగా తగ్గించే అద్భుతమైన చిట్కాలను మీకోసం అందించాం.

ఒకప్పుడు పాదాల పగుళ్ళు అనేవి చలికాలంలో మాత్రమే ఉండేవి. కానీ మారిన పరిస్థితి కారణంగా కాలంతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లోను పాదాల పగుళ్ళు అనేవి కనిపిస్తున్నాయి.

పాదాల పగుళ్లు అనేవి వయస్సుతో సంబందం లేకుండా అన్ని వయస్సుల వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పాదాల పగుళ్లు ఏర్పడినప్పుడు ఎర్రగా కమిలి అందవిహీనంగా కనపడటమే కాకుండా కొన్ని సార్లు నొప్పి కూడా వస్తుంది. పాదాల పగుళ్ల సమస్య చలికాలంలో ఎక్కువగా ఉంటుంది.

ఈ సమస్యను అసలు అశ్రద్ద చేయకూడదు. పాదాల సంరక్షణకు తప్పనిసరిగా ప్రత్యేక శ్రద్ధ అవసరం. అప్పుడే మన పాదాలు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి. పాదాల పగుళ్ళు ఏర్పడినప్పుడు ఖరీదైన క్రీమ్ లు వాడవలసిన అవసరం లేదు. కాస్త శ్రద్ద పెట్టి ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా బాగా పనిచేస్తాయి.

ఒక కొవ్వొత్తిని తీసుకొని తురమాలి. ఒక స్పూన్ కొవ్వొత్తి తురుమును ఒక బౌల్ లోకి తీసుకొని దానిలో ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి డబుల్ బాయిలింగ్ పద్దతిలో వేడి చేయాలి. ఆ తర్వాత పొయ్యి మీద నుంచి దించి ఒక విటమిన్ E capsule లోని oil ని వేసి బాగా కలిపి రాత్రి సమయంలో పగుళ్లు ఉన్న ప్రదేశంలో రాయాలి.

రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం పాదాలను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా 2 రోజులు చేస్తే సరిపోతుంది. పాదాల పగుళ్లు ఎక్కువగా ఉంటే ఎక్కువ రోజుల సమయం పడుతుంది. ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

పాదాల పగుళ్లకు చిట్కాలు హోమ్ మేడ్ పెడిక్యూర్ బ్యూటీ టిప్స్ తెలుగు Cracked Heels Home Remedy Telugu Beauty Tips Soft Feet Tips Telugu Foot Care Routine

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."