రాత్రి పడుకునే ముందు 2 చుక్కల ఆవనూనె రాస్తే.. మీ ముఖం బంగారంలా మెరుస్తుంది!
Mustard Oil Skin Benefits In telugu : అందమైన, కాంతివంతమైన ముఖం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ రోజువారీ ఉరుకులు పరుగుల జీవితంలో దుమ్ము, కాలుష్యం, ఎండల వల్ల చర్మం నిర్జీవంగా, డల్‌గా మారుతుంది. దీనికోసం వేలకు వేలు ఖర్చుపెట్టి కెమికల్ క్రీమ్స్ వాడుతుంటాము.
కానీ మన అమ్మమ్మల కాలం నాటి ఒక అద్భుతమైన బ్యూటీ సీక్రెట్ మీ వంటగదిలోనే ఉందన్న విషయం మీకు తెలుసా? అదే ‘ఆవనూనె’. అవును, కేవలం వంటలకే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
రాత్రి పడుకునే ముందు రెండు చుక్కల ఆవనూనెను ముఖానికి రాసుకుంటే మీ చర్మంలో వచ్చే మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఆ అద్భుత ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఆవనూనెను ముఖానికి రాయటం వలన ముఖంపై చర్మం బిగుతుగా మారడమే కాకుండా ముఖంపై ఉన్న మృత చర్మ కణాలు తొలగిపోతాయి. మనలో చాలామంది ముఖం అందంగా కాంతివంతంగా మెరవాలని కోరుకుంటారు. దానికోసం వేల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టి మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీములు, స్కిన్ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు.

అయితే అందులో ఉండే రసాయనాల కారణంగా చర్మానికి నష్టం కలిగే అవకాశం ఉంది. అలా కాకుండా మన ఇంటిలోనే చర్మం తెల్లగా మెరవడానికి ఒక నూనెను ఉపయోగించవచ్చు. చర్మం ఆరోగ్యంగా ఉండటానికి చర్మం సహజసిద్ధంగా తేమగా ఉండటానికి ఆవ నూనె చాలా బాగా సహాయ పడుతుంది.
ఆవనూనెను ముఖం మీద రాసి మసాజ్ చేస్తే చర్మం తేమగా ఉండటమే కాకుండా చర్మ సమస్యలు నయమవుతాయి. అంతేకాకుండా అవ నూనెలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన చర్మంపై హానికరమైన బాక్టీరియాని తొలగించి మొటిమలు వంటివి రాకుండా సహాయపడుతుంది. .
ఆవనూనె ఒక సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఇది చర్మంలో తేమను లాక్ చేసి పోషణ అందించడంలో సహాయపడి చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది. ఆవనూనెను చర్మానికి రాసి మసాజ్ చేయడం వలన టానింగ్, పిగ్మెంటేషన్, నల్లని మచ్చలు అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
ఇది చర్మానికి సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పని చేసి చర్మాన్ని లోతుగా శుభ్రపరచి ముఖంపై మృత చర్మ కణాలను శుభ్రపరచడంలో సహాయ పడుతుంది. వయస్సు పెరిగే కొద్ది వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. ముఖ చర్మాన్ని బిగుతుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ముఖంపై ఉండే సన్నని గీతలు, ముడతలు మరియు రంధ్రాలను తగ్గించి మరింత యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

