Kitchenvantalu

Black Grape Halwa:నల్ల ద్రాక్షతో టేస్టీ టేస్టీ హల్వాను ఈజీగా తయారు చేసుకోండి..

Black Grape Halwa:నల్ల ద్రాక్షతో టేస్టీ టేస్టీ హల్వాను ఈజీగా తయారు చేసుకోండి.. నల్ల ద్రాక్ష పుల్లగా ఉంటాయి. అందువల్ల చాలా మంది తినటానికి ఇష్టపడరు. అందుకే ఈ రోజు నల్ల ద్రాక్షతో హాల్వా తయారీ తెలుసుకుందాం.

నల్ల ద్రాక్షల్లో విటమిన్స్, మినలర్స్, యాంటీఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్, ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్, ఫైబర్ ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

కావలసిన పదార్ధాలు:
నల్లద్రాక్షలు – వంద గ్రాములు
మైదా – పావుకేజీ
పంచదార – పావుకేజీ
జీడిపప్పులు – 6
పిస్తా పప్పులు – 6
బాదం పప్పులు – 6
నెయ్యి – సరిపడా

తయారీ విధానం:
ముందుగా మైదాపిండిలో కొద్దిగా నీళ్ళుపోసి ముద్దలా కలపాలి. కలిపిన ముద్దలో మూడు కప్పుల నీళ్ళు పోసి పూర్తిగా నీళ్ళలో కలిసేలా బాగా కలిపి పక్కన పెట్టాలి (మైదా పాలుగా అవ్వటానికి). పిండి కలిపినా అరగంటకి మైదాలో నీళ్ళు పైకి తేరుకుంటాయి.

తేరుకున్న నీరు తీసేస్తే, అడుగున మైదా పాలు వుంటాయి. ద్రాక్షలో గింజలు తీసి మిక్సి లో వేసి జ్యూస్ లా చేసి ఉంచాలి. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి మూకుడు పెట్టి పంచదార, కొద్దిగా నీళ్ళు పోసి పాకం పట్టాలి. తీగ పాకం వచ్చాక మైదా పాలు, ద్రాక్ష జ్యూసు వేసి కలపాలి.

మాడిపోకుండా కలుపుతుండాలి. ఇది గట్టిపడి ముద్దలా అవ్వుతుంది. ఇప్పుడు నెయ్యి వేసి బాగా కలపాలి. మైదాపాలు, ద్రాక్ష రసం, పంచదార, నెయ్యి బాగా కలిసి ముద్దలాఅయి మూకుడు అంచులు విడుతుంది. అంతే ద్రాక్ష హల్వా తయార్ అయ్యినట్టే.

ఒక ప్లేటుకి నెయ్యి రాసి దానిలోకి తయారయిన హల్వాను వేసి సమంగా సర్ది, జీడిపప్పు ముక్కలు, బాదం ముక్కలు పైన చల్లితే ద్రాక్ష హల్వా రెడి. చల్లారక ముక్కలుగా కట్ చెసి సర్వ్ చెయ్యాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."