Rice Flour Bonda Recipe:బియ్యంపిండితో బొండాలు.. ఇలా చేయండి మంచి రుచిగా రౌండ్ గా వస్తాయి..
Rice Flour Bonda Recipe:బియ్యంపిండితో బొండాలు.. ఇలా చేయండి మంచి రుచిగా రౌండ్ గా వస్తాయి.. బియ్యంపిండితో స్నాక్ చేయాలని అనుకుంటే ఈ స్నాక్ ని ట్రై చేయవచ్చు.
కావాల్సిన పదార్థాలు
బియ్యం పిండి – 1 కప్పు
బొంబాయి రవ్వ – ¼ కప్పు
ఉల్లిపాయలు – 1 (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి – 2 (సన్నగా తరిగినవి)
కరివేపాకు – 10-12 (తరిగినవి)
అల్లం – 1 టీస్పూన్ (తురిమినది)
జీలకర్ర (Cumin Seeds) – 1 టీస్పూన్
ఉప్పు (Salt) – రుచికి సరిపడా
నీళ్లు (Water) – అవసరమైనంత
నూనె (Oil) – వేయించడానికి
తయారీ విధానం (Preparation Method):
ఒక మిక్సీ జార్ లో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, తురిమిన అల్లం వేసి మిక్స్ చేయండి. ఒక గిన్నెలో బియ్యం పిండి, బొంబాయి రవ్వ, ఉప్పు, జీలకర్ర వేసి బాగా కలపండి. ఆ దీనిలో మిక్సీ చేసిన మిశ్రమం వేసి నీటిని పోస్తూ గట్టి పిండిలా (వడ పిండిలా) కలపండి.
పిండి నుండి చిన్న చిన్న ఉండలు చేస కడాయిలో నూనె వేడి చేసి, మీడియం మంట మీద ఉండలను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించండి. వేడి వేడి బొండాలను కొబ్బరి చట్నీ లేదా టమాట సాస్‌తో సర్వ్ చేయండి. ఈ బొండాలు చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం సమయంలో మంచి స్నాక్ గా బాగుంటుంది.
చిట్కాలు (Tips):
పిండి చాలా గట్టిగా లేదా పలుచగా ఉండకూడదు.
నూనె బాగా వేడెక్కిన తర్వాతే బొండాలు వేయండి.. లేకపోతే నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి.
రుచి కోసం కొత్తిమీర లేదా పుదీనా కూడా చేర్చవచ్చు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

