Kitchenvantalu

Paneer Kolhapuri:ఎప్పుడూ ఒకేలా పనీర్ కర్రీ కాకుండా మంచి రుచిగా స్పైసీ గా ఇలా చేయండి..

Paneer Kolhapuri:ఎప్పుడూ ఒకేలా పనీర్ కర్రీ కాకుండా మంచి రుచిగా స్పైసీ గా ఇలా చేయండి.. ఇప్పుడు చెప్పే విధంగా చేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి ఒకసారి ట్రై చేయండి.

కావాల్సిన పదార్థాలు:
– పనీర్ – 200 గ్రాములు (చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి)
– టమాటాలు – 2 (పేస్ట్ చేసుకోండి)
– ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగి)
– క్యాప్సికమ్ – 1 (చిన్న ముక్కలుగా)
– అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
– గరం మసాలా – 1 టీస్పూన్
– కోల్హాపూరి మసాలా – 2 టీస్పూన్లు
– కారం పొడి – 1 టీస్పూన్
– పసుపు – 1/4 టీస్పూన్
– జీడిపప్పు పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు
– కొత్తిమీర –
– నూనె లేదా వెన్న – 2 టేబుల్ స్పూన్లు
– ఉప్పు – రుచికి తగినంత
– నీరు – 1/2 కప్పు

కోల్హాపూరి మసాలా
– ఎండు మిర్చి – 4
– ధనియాలు – 1 టేబుల్ స్పూన్
– జీలకర్ర – 1 టీస్పూన్
– లవంగాలు – 4
– దాల్చిన చెక్క – చిన్న ముక్క
– గసగసాలు – 1 టీస్పూన్
– కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు
– (ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి, పొడి చేసుకోండి)

తయారీ విధానం
పన్నీర్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గోరువెచ్చ నీటిలో పది నిమిషాలు నానబెడితే సాఫ్ట్ గా అవుతాయి. ఆ తర్వాత నీటిని తీసేయాలి.

కోల్హాపూరి మసాలా కోసం ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు, కొబ్బరి తురుము పాన్ లో వేసి సిమ్ లో డ్రై రోస్ట్ చేయాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పొడిగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

ఒక పాన్ లో నూనె లేదా వెన్న వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేగించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం వేగించాలి. ఆ తర్వాత టమాటా పేస్ట్, కారం, పసుపు, కొలహపురి మసాలా వేసి బాగా వేగించాలి.

ఆ తర్వాత జీడిపప్పు పేస్ట్ వేసి మరో రెండు నిమిషాలు వేయించి ఆ తర్వాత క్యాప్సికం ముక్కలు వేసి రెండు లేదా మూడు నిమిషాలు వేయించి అర కప్పు నీటిని వేసి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించాలి. గ్రేవీలో నూనె పైకి తేలిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు ఉడికించాలి.

చివరగా గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఇది బటర్ నాన్, రోటి, జీరా రైస్ వంటి వాటికి మంచి కాంబినేషన్ అని చెప్పవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ