Kitchenvantalu

Kaju Paneer Masala:చపాతీ, ఫుల్కాలోకి రెస్టారంట్ రుచి వచ్చేట్టు కాజు పనీర్ మసాలా చేయండిలా..

Kaju Paneer Masala:చపాతీ, ఫుల్కాలోకి రెస్టారంట్ రుచి వచ్చేట్టు కాజు పనీర్ మసాలా చేయండిలా.. పనీర్ లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. పనీర్,జీడిపప్పుతో ఇలా కర్రీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఒక సారి ట్రై చేయండి.

కావాల్సిన పదార్థాలు:
– టమాటాలు – 2 పెద్దవి
– జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్లు
– నూనె – 2 టేబుల్ స్పూన్లు
– దాల్చిన చెక్క – 1 ఇంచు
– లవంగాలు – 3
– యాలకులు – 2
– జీలకర్ర – ½ టీస్పూన్
– ఉల్లిపాయలు – 2, చిన్నగా తరిగినవి
– అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
– పసుపు – ½ టీస్పూన్
– జీలకర్ర పొడి – ½ టీస్పూన్
– ధనియాల పొడి – 1 టీస్పూన్
– కారం – 1½ టీస్పూన్
– గరం మసాలా – ½ టీస్పూన్
– ఉప్పు – రుచికి సరిపడా
– ఫ్రెష్ క్రీమ్ – 2 టేబుల్ స్పూన్లు
– నీరు – ½ కప్పు
– పనీర్ – 250 గ్రాములు
– వేయించిన జీడిపప్పు – ¼ కప్పు
– బటర్ – 2 టేబుల్ స్పూన్లు
– కసూరి మెంతి – 1 టీస్పూన్
– కొత్తిమీర – కొద్దిగా, తరిగినది

తయారీ విధానం:
జార్‌లో టమాటాలు, జీడిపప్పు వేసి మెత్తని పేస్ట్ గా గ్రైండ్ చేయండి. పాన్ లో నూనె వేసి వేడి చేసి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర వేసి వేయించండి. తరిగిన ఉల్లిపాయలు వేసి బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించండి.

ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి. ఆ తర్వాత ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపండి. ఒక నిమిషం వేయించిన తర్వాత, గ్రైండ్ చేసిన టమాటా-జీడిపప్పు మిశ్రమం వేసి, నీరు పోసి మూత పెట్టి ఉడికించండి.

ఆ తర్వాత పనీర్ ముక్కలు, వేయించిన జీడిపప్పు, బటర్ వేసి కలపండి. మూత పెట్టి నూనె పైకి తేలే వరకు తక్కువ మంటపై ఉడికించండి. కసూరి మెంతి, తరిగిన కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి.రుచికరమైన కాజు పనీర్ కర్రీ సిద్ధం.

ఇలా వారంలో రెండు సార్లు చేసుకొని తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు. కాబట్టి ఒక సారి ట్రై చేయవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ