Kitchenvantalu

Aloo Bonda:ఇలా ఆలు బోండా చేసారంటే అప్పటికప్పుడు స్నాక్స్,టిఫిన్ లోకి వేడివేడిగా తినేయచ్చు

Aloo Bonda:ఇలా ఆలు బోండా చేసారంటే అప్పటికప్పుడు స్నాక్స్,టిఫిన్ లోకి వేడివేడిగా తినేయచ్చు.. బంగాళదుంప అంటే అందరికి ఇష్టం. సాదారణంగా బంగాళదుంపతో కూర,వేపుడు,కుర్మా వంటివి చేసుకుంటాం. అలా కాకుండా aloo bonda ఒకసారి ట్రై చేయండి. రుచి చాలా అద్భుతంగా ఉంటుంది.

కావాల్సిన పదార్థాలు:
బొండా పిండి కోసం:
– శనగపిండి – 1 కప్పు
– బియ్యం పిండి – ¼ కప్పు
– ఉప్పు – రుచికి సరిపడా
– పసుపు – ¼ టీస్పూన్
– కారం – ¼ టీస్పూన్
– వాము – ½ టీస్పూన్
– నీళ్లు – తగినంత

ఆలూ స్టఫింగ్ కోసం:
– ఉడికించిన ఆలు – 3
– పచ్చిమిర్చి – 3
– అల్లం – ½ అంగుళం ముక్క
– వెల్లుల్లి రెబ్బలు – 4
– ధనియాలు – ½ టీస్పూన్
– నూనె – 1½ టీస్పూన్
– ఆవాలు – ½ టీస్పూన్
– జీలకర్ర – ½ టీస్పూన్
– ఇంగువ – ¼ టీస్పూన్
– ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)
– పసుపు – ¼ టీస్పూన్
– కారం – ½ టీస్పూన్
– ఆమ్‌చూర్ పొడి – ½ టీస్పూన్
– ఉప్పు – రుచికి సరిపడా
– కొత్తిమీర – కొద్దిగా (తరిగినది)
– నిమ్మరసం – ½ నిమ్మకాయ

తయారీ విధానం:
ఒక గిన్నెలో శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, పసుపు, కారం, వాము వేసి బాగా కలపాలి.కొద్దిగా నీళ్లు పోస్తూ కలుపుకుంటూ, మరీ పలుచగా లేదా చిక్కగా లేని సమానమైన పిండి తయారు చేయాలి.పిండిపై మూత పెట్టి పక్కన ఉంచాలి.

ఆలూ స్టఫింగ్ తయారీ:
ఉడికించిన ఆలును మెత్తగా చేసి పక్కన పెట్టుకోవాలి.మిక్సీ జార్‌లో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి బరకగా మిక్సీ చేయాలి.ఒక బాణలిలో నూనె వేడి చేసి, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి మిశ్రమం వేసి వేయించాలి.

ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.ఉప్పు, పసుపు, కారం, ఆమ్‌చూర్ పొడి, ఇంగువ వేసి కలపాలి.మెత్తగా చేసిన ఆలు వేసి, మిశ్రమం తడిపోయే వరకు వేయించాలి.చివరగా కొత్తిమీర, నిమ్మరసం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఆలూ మిశ్రమం చల్లారిన తర్వాత చిన్న ఉండలుగా చేయాలి.వేయించడానికి కడాయిలో నూనె వేడి చేయాలి. 2 టేబుల్ స్పూన్ల వేడి నూనెను పిండిలో వేసి కలపాలి.
ఆలూ ఉండలను పిండిలో ముంచి, మీడియం మంటపై నూనెలో వేసి ఎర్రగా వేయించాలి.వేగిన బొండాలను ప్లేట్‌లోకి తీసుకోవాలి.రుచికరమైన ఆలూ బొండా సిద్ధం!

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ