Bellam kobbari barfi :కేవలం 15 నిమిషాల్లో కొబ్బరి బెల్లంతో బర్ఫీ ఇలా ఈజీగా చేస్కోండి చాలా రుచిగా ఉంటుంది
Bellam kobbari barfi :కేవలం 15 నిమిషాల్లో కొబ్బరి బెల్లంతో బర్ఫీ ఇలా ఈజీగా చేస్కోండి చాలా రుచిగా ఉంటుంది.. కొబ్బరి,బెల్లంలలో ఎన్నో పోషకాలు ఉన్నాయి, ఈ వేసవిలో ఈ రెండింటిని ఉపయోగించి స్వీట్ చేసుకొని తింటే వేసవిలో వచ్చే నీరసం ఉండదు.
కావాల్సిన పదార్థాలు:
– పచ్చికొబ్బరి ముక్కలు – 1 కప్పు
– కాచి చల్లార్చిన పాలు – ¾ కప్పు
– బెల్లం తురుము – ¾ కప్పు
– యాలకులు – 3
– నెయ్యి – ¼ కప్పు
– శనగపిండి – 1 కప్పు
తయారీ విధానం:
జార్‌లో పచ్చికొబ్బరి ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత ఇందులో పాలు, బెల్లం తురుము, యాలకులు వేసి మరోసారి మెత్తగా గ్రైండ్ చేయండి.ఒక పాన్ లో నెయ్యి వేసి వేడిచేయాలి. నెయ్యి కాస్త వేడి అయ్యాక శనగపిండి వేసి, కలుపుతూ 5 నిమిషాలు వేయించండి.
1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, మరో 5 నిమిషాలు కలుపుతూ వేయించండి.గ్రైండ్ చేసిన కొబ్బరి మిశ్రమాన్ని వేసి, పాన్ కి అంటకుండా విడిపోయే వరకు కలుపుతూ ఉడికించండి.మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, 5 నిమిషాలు ఉడికించండి.
చివరగా మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలిపి, స్టవ్ ఆఫ్ చేయండి. మిశ్రమాన్ని ముక్కలుగా కట్ చేసి, రుచికరమైన కొబ్బరి బర్ఫీని సిద్ధం చేయండి. ఈ స్వీట్ చాలా బాగుంటుంది.
దీనిలో మనం ఉపయోగించిన అన్ని పదార్ధాలలో ఉన్న పోషకాలు మనకు చాలా బాగా సహాయపడతాయి. కాబట్టి ఈ వేసవిలో ఈ స్వీట్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

