Jonna Murukulu:షుగర్ ఉన్నవాళ్లుకూడా హ్యాపీ గా తినగలిగే హెల్తి మురుకులు టేస్టీగా చాలా ఈజీగా చేయొచ్చు.
Jonna Murukulu:షుగర్ ఉన్నవాళ్లుకూడా హ్యాపీ గా తినగలిగే హెల్తి మురుకులు టేస్టీగా చాలా ఈజీగా చేయొచ్చు. జొన్న పిండిలో ఉన్న పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు కూడా చాలా హ్యాపీగా తినేయవచ్చు.
కావాల్సిన పదార్థాలు:
– జొన్నపిండి: 3 కప్పులు
– నువ్వులు: అర కప్పు
– వేరుశనగ పొడి: 1 కప్పు
– వాము: 1 టేబుల్ స్పూన్
– పచ్చిమిర్చి పేస్టు: రుచికి సరిపడా
– ఉప్పు: రుచికి సరిపడా
– వెన్న: 2 టేబుల్ స్పూన్లు
– వేయించడానికి నూనె: తగినంత
తయారీ విధానం:
ఒక గిన్నెలో జొన్నపిండి, నువ్వులు, వేరుశనగ పొడి, వాము, పచ్చిమిర్చి పేస్టు, ఉప్పు, మరియు వెన్న వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా మురుకుల పిండిలా కలుపుకోవాలి.
స్టవ్‌పై పాన్ పెట్టి, నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత, మురుకుల గొట్టం సాయంతో పిండిని నూనెలో ఒత్తాలి. ఎక్కువ మంటపై, నూనె ఎక్కువగా పీల్చుకోకుండా, కరకరలాడేలా వేయించాలి.
ఇలా చేస్తే రుచికరమైన, కరకరలాడే జొన్నపిండి మురుకులు సిద్ధం! ఒకసారి ప్రయత్నించి ఆస్వాదించండి. ఈ వేసవిలో పిల్లలు ఇంటిలో ఉంటారు.. కాబట్టి ఇలా ఆరోగ్యకరమైన స్నాక్స్ చేస్తే మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

