Good Cholesterol vs Bad Cholesterol: మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ మధ్య తేడా తెలుసా..?
Good Cholesterol vs Bad Cholesterol: మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ మధ్య తేడా తెలుసా.. కొలెస్టరాల్ అనే పదం వినగానే చాలామంది భయపడతారు. దీన్ని అనారోగ్యానికి కారణంగా భావిస్తారు. అయితే, వైద్యులు కొలెస్టరాల్ శరీరానికి చాలా అవసరమని చెబుతున్నారు.
కణజాలం ఏర్పాటు, హార్మోన్ల ఉత్పత్తి కోసం కొలెస్టరాల్ అవసరం. కానీ, దీని స్థాయిలు పరిమితిని మించితే గుండెపోటు, ఇతర సమస్యలు తలెత్తుతాయి.
నిపుణుల ప్రకారం, శరీరంలో మంచి కొలెస్టరాల్ (HDL) మరియు చెడు కొలెస్టరాల్ (LDL) మధ్య సమతుల్యత లోపిస్తే అనారోగ్యం మొదలవుతుంది. రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్ర సమస్యలు వస్తాయి.
మంచి vs చెడు కొలెస్టరాల్
మంచి కొలెస్టరాల్ (HDL): హై డెన్సిటీ లిపోప్రొటీన్ (HDL) శరీరంలోని అదనపు కొవ్వును తొలగిస్తుంది. ఈ కొవ్వు రక్తం ద్వారా కాలేయానికి చేరి, అక్కడ నుంచి విసర్జనకు గురవుతుంది. HDL గుండె సమస్యల నుంచి రక్షణ కవచంలా పనిచేస్తుంది.
చెడు కొలెస్టరాల్ (LDL): లో డెన్సిటీ లిపోప్రొటీన్ (LDL) రక్తనాళాల్లో పేరుకుపోయి ప్లాక్‌లను ఏర్పరుస్తుంది. LDL స్థాయిలు ఎక్కువైతే రక్తనాళాల్లో ఇన్‌ఫ్లమేషన్ ఏర్పడి, ఎథెరోస్క్లెరోసిస్‌కు దారితీస్తుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్‌కు కారణమవుతుంది.
సమతుల్యత కోసం చిట్కాలు
మంచి, చెడు కొలెస్టరాల్ సమతుల్యత కోసం కొన్ని నియమాలు పాటించాలి:
– పండ్లు, కూరగాయలు, పప్పులు, పీచు పదార్థాలు అధికంగా తీసుకోవాలి.
– రోజూ కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఇది HDL స్థాయిలను పెంచి, LDLని తగ్గిస్తుంది.
– మద్యం, ధూమపానం వంటి అలవాట్లను వదిలించుకోవాలి.
– బరువును నియంత్రణలో ఉంచుకోవాలి.
ఈ జాగ్రత్తలతో చెడు కొలెస్టరాల్ ప్రభావాన్ని తగ్గించి, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

