Movies

ఈ వారం తేజస్వి ఎలిమినేట్ కావటానికి అసలు కారణం ఇదే

ఎంతో హుషారుగా నడుస్తున్న బిగ్ బాస్ సీజన్ 2లో హౌస్ మెంబర్స్ మద్య గొడవలు ముదిరిపాకాన పడుతున్నాయి. ఇప్పటివరకూ సంజన, నూతన నాయడు, కిరీటి ఎలిమినేట్ కాగా, ఇప్పుడు మరికొందరు డేంజర్ జోన్ లోకి చేరిపోయారు. ఎందుకంటే హౌస్ లో ఆది నుంచి ఏక్టివ్ రోల్ పోస్తున్నవాళ్ళు సైతం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేకపోలేదన్న ప్రచారంతో ఈ వీకెండ్ ఏమి జరుగుంటోందననే ఆశ సహజంగానే రెట్టింపయింది. ఎందుకంటే కంటెస్టెంట్ ల మధ్య విపరీతంగా పోటీ సాగేందుకు వీలుగా కొత్త కొత్త టాస్క్ లిస్తూ బిగ్ బాస్ తనదైన శైలిలో వ్యవహరిస్తున్నాడు.
ఇక ఎక్కడా ఫ్రెండ్స్ ని కూడా కలవకుండా పోటీలో తాము నిరంతరం కొనసాగేలా ప్లాన్ చేస్తూ ఆడియన్స్ కి ఎంటర్ టైన్ మెంట్ పంచడంలో కంటెస్టెంట్లు నిమగ్నమయ్యారు.

ఇక గతంలో మాదిరిగా ఈ వీకెండ్ లో ఎలిమినేటి అయ్యేదెవరంటూ విపరీతంగా చర్చ నడుస్తోంది. బిగ్ బాస్ లో ఏదైనా జరగచ్చోన్న ట్యాగ్ లైన్ ఉండనే ఉన్నందున ఈసారి ఎవరిని ఎలిమినేట్ చేస్తారనే దానిపై ఊహాగానాలకు బలం చేకూరుతోంది. ఎందుకంటే బిగ్ బాస్ షోని ఒక్కసారిగా పీక్ స్టేజ్ కి తీసుకెళ్లాలంటే ఎవరూ ఊహించని విధంగా ఓ స్టార్ ని బయటకు పంపేందుకు రంగం సిద్ధం అయినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.

అలా జరిగే పక్షంలో టాలీవుడ్ స్టార్ తేజస్వి ఈ సారి ఎలిమినేట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తోందనే మాట బలంగా వినిపిస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో ఆమె చేష్టలు, ఇతర సభ్యులతో ఆమె ప్రవర్తన మరీ అతిగా ఉన్నందున ఓ జర్క్ ఇవ్వాలని బిగ్ బాస్ యోచిస్తున్నట్టు భోగట్టా. పెళ్లయిన సామ్రాట్ తో తేజస్వి చేష్టలు హాద్దుమీరిన చందంగా ఉన్నాయని కూడా టాక్ వినిపిస్తోంది.

నిజం చెప్పాలంటే ఆమె చెప్పే మాటలు ఒక్కోసారి మరీ రోతపుట్టిస్తున్నాయని, ఇక ఆమె డ్రెస్ కోడ్ మరీ దారుణంగా ఉందని క్రిటిక్స్ సైతం విమర్శలు గుప్పిస్తున్నారు.ఎంతో ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో బిగ్ బాస్ వీక్షిస్తుంటే తేజస్వి ప్రత్యక్షం అయితే చాలు అసలు చూడలేకపోతున్నామని సోషల్ మీడియాలో కామెంట్స్ పడిపోతున్నాయి.

ఇక ఆమె మరో వారం హౌస్ లో ఉంటే హౌస్ మొత్తం స్పాయిల్ అవుతుందన్న వాదన వినిపిస్తోంది. మొత్తం మీద గతవారంలో పోలిస్తే, ఆమెకు ఓటు చేసేవాళ్ళు క్రమంగా తగ్గిపోతున్నారని అంటున్నారు. అందుకే ఆమెను బయటకు సాగనంపి మరో మాస్ మసాలా సినీ తారకు ఎంట్రీ ఇస్తారని వినిపిస్తోంది. ఏదైతేనేం నెగిటివ్ కూడా విపరీతంగా పెరిగిపోవడంతో ఈవీకేండ్ లో తేజస్వి ఎలిమినేట్ అవుతుందని వార్తలు వైరల్ అవుతున్నాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."