Movies

5 నిమిషాల యాడ్ కోసం యంగ్ టైగర్ తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

ఇప్పుడున్న యంగస్టర్స్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ కి వుండే క్రేజే వేరు. ఆమధ్య కొంచెం హిట్స్ తగ్గినా, తగిన జాగ్రత్తలు తీసుకుని డిఫరెంట్ మూవీస్ కి సైన్ చేయడంతో టెంపర్ నుంచి,జై లవకుశ వరకూ వరుస విజయాలు నమోదు చేసుకుని, ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు. ఇక తారక్ స్టార్ క్రేజ్ ని క్యాష్ చేసుకోడానికి కమర్షియల్ సంస్థలు వెంటపడ్తున్నాయి. ఇక ఈ క్రమంలో వచ్చిన ఓ యాడ్ కి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్. స్మార్ట్ ఫోన్ రంగంలో ఇమేజ్ గల సెలెక్ట్ మొబైల్స్ కి యాడ్ అంబాసిడర్ గా చేస్తున్న జూనియర్ కి గ్రాండ్ గానే ముట్టజెప్పారట నిర్వాహకులు. మొబైల్ బ్రాండింగ్ తో పాటు సెలెక్ట్ మొబైల్స్ యాడ్ లో కనిపిస్తాడట తారక్. ఐదు నిమిషాల నిడివి గల యాడ్ కోసం రూ ఐదు కోట్లు అందుకున్నాడట.

చిన్న యాడ్ కోసం కోట్ల రూపాయలు తీసుకున్న ఎన్టీఆర్ స్టామినా చూసారుగా. మలబార్ గోల్డ్, నవరత్న తైలం యాడ్స్ లో ఇప్పటికే కనిపిస్తున్న తారక్,వాటికి కోటి రూపాయల వరకూ తీసుకున్నాడు. అయితే సెలక్ట్ మొబైల్స్ విషయంలో మాత్రం అదనంగా తీసుకున్నాడని చెప్పవచ్చు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."