Movies

కౌశల్ కి ప్రేమ సందేశం పంపిన భార్య నీలిమ…కన్నీళ్లు పెట్టుకున్న కౌశల్

టెలివిజన్ రంగంలో తనదైన ముద్రవేసిన స్టార్ మా ప్రసారం చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 లైవ్ షో లో కంటెస్టెంట్స్ తమ వినోదాన్ని పంచుతున్నారు. ఇందులో కౌశల్ సందడి చేస్తూ, ఓ హీరోలా అయిపోయాడంటే ఆశ్చర్యం పోనక్కర్లేదు. సోషల్ మీడియాలో కౌశల్ కి ఎంతటి ఫాన్ ఫాలోయింగ్ ఉందో,చెప్పక్కర్లేదు. అయితే యాంకర్ ప్రదీప్ రాకతో కౌశల్ కి పోటీ ఏర్పడిందని అందరూ అనుకున్నారు.బిగ్ బాస్ హౌస్ లోకి కేవలం తన షో ప్రమోషన్ కోసం వచ్చానని ప్రదీప్ చెప్పాడు. హౌస్ లోకి వస్తూనే, హౌస్ మేట్స్ కి వారి వారి ఇళ్లనుంచి కావాల్సినంత సమాచారం తెచ్చాడు. ఇక కౌశల్ కి అయితే వారి ఇంటినుంచి ముఖ్యంగా భార్య నీలిమ నుంచి ఓ ప్రేమ సందేశం మోసుకొచ్చాడు. కౌశల్ ఈవెంట్ మేనేజ్ మెంట్ లో చాలా టాప్ పొజిషన్ లో ఉన్నాడనేది తెలిసిన విషయమే కదా.

తన వైఫ్ కి ఈవెంట్ మేనేజ్ మెంట్ బాధ్యతలన్నీ అప్పగించి మరీ బిగ్ బాస్ హౌస్ లోకి కౌశల్ ఎంట్రీ ఇచ్చాడు. తన భార్య ఆ బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వహిస్తుందని కౌశల్ పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా,లేటెస్ట్ గా ఓ ఈవెంట్ ని సక్సెస్ ఫుల్లుగా కంప్లీట్ చేసి, తన బాధ్యతలను నెరవేర్చినట్లు కౌశల్ భార్య నీలిమ చెప్పమందని ప్రదీప్ హౌస్ లో వివరించాడు.

ఇక కౌశల్ పిల్లలు కూడా టివిలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని, అయితే కౌశల్ ని పిల్లలు మిస్ అవుతున్నారని ప్రదీప్ చెప్పగానే కౌశల్ ఎమోషన్ కి గురయ్యాడు. అంతేకాదు కంటతడి పెట్టుకున్నాడు. ఇలా లవ్ మెసేజ్ ఇంటినుంచి రావడంతో ఇక కౌశల్ తన భార్య చెప్పుకొచ్చాడు.
‘ప్రస్తుతం నేను ఇలా సక్సెస్ ఫుల్ గా ఉన్నానంటే అందుకు నా భార్య నీలిమ అందిస్తున్న ఎంకరేజ్ మెంట్ కారణం.

ఎల్లప్పుడూ ఆమె సపోర్ట్ ఉంటుంది. చిన్నపిల్లలను వదిలిపెట్టి వచ్చానంటే అది ఆమె ఇచ్చిన సపోర్ట్ కారణంగానే. నిజానికి ఇంట్లో వాళ్ళను మిస్ అవుతున్నా. అయితే తనను ఆమె ఏ ఉద్దేశ్యంతో పంపిందో అది సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేయాలని చాలా పట్టుదలగా వున్నాను’అని కౌశల్ తన ప్రేమ సందేశాన్ని ప్రదీప్ తో పంచుకున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."