Movies

పెళ్లి చూపులు షో గుట్టు బయటపెట్టిన ప్రదీప్ తల్లి…షాక్ లో ప్రదీప్,స్టార్ మా

మోస్ట్ బ్యాచిలర్ యాంకర్ ప్రదీప్ నిర్వహిస్తున్న పెళ్లి చూపులు రియాల్టీ షో గురించి రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కొందరు ఈ షోని బానే ఎంజాయ్ చేస్తున్నారు. అయితే హిందూ సంప్రదయాన్ని మంటగలిపేలా ఈ షో ఉందని, అమ్మాయిలను ఈ షో కి పంపడం దారుణమని,అసలు తల్లిదండ్రులు ఎలా ఒప్పుకున్నారని ఇలా రకరకాలుగా విమర్శలు వస్తున్నాయి. ఈనేపథ్యంలోనే ప్రదీప్ తల్లి ఈ షో గురించి సంచలనం కల్గించే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తెలుగులో యాంకర్స్ అనగానే సుమ,ఝాన్సీ,ఉదయభాను,ఇలా పలువురు లేడీ యాంకర్స్ పేర్లు టక టకా చెప్పస్తారు. కానీ మేల్ యాంకర్ అనగానే ప్రదీప్ పేరే గుర్తొస్తుంది.

ఇలాంటి ప్రదీప్ చేస్తున్న పెళ్లి చూపులు షో నేపథ్యంలో అతడి ప్రవర్తన తీరు మీద కూడా విమర్శలు చెలరేగుతున్నాయి. అసలు ఈ షో నిజమేనా,నిజంగా ఇందులో సెలెక్ట్ చేసుకున్న అమ్మాయిని ప్రదీప్ పెళ్లి చేసుకుంటాడా లేదా అనే అనుమానాలు ఇంకా నివృత్తి కాలేదు. ఇదేసమయంలో అతని తల్లి ఏం చెప్పిందో ఓ సారి విందాం. ‘ప్రదీప్ పెళ్లి పట్ల మంచి ఒపీనియన్ కలిగి ఉన్నాడు.
Anchor Pradeep
అలాంటి ఇలాంటి వ్యక్తి మా అబ్బాయి కాదు. షో లో సెలెక్ట్ చేసుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా లేదా అనే సందేహాలు వస్తున్నాయి. నిజానికి ఈ షో చేస్తే ఎలా ఉంటుందో అని చాలాసార్లు మా వాడు ఆలోచించాడు’అని ప్రదీప్ తల్లి చెప్పింది.’ఒక విషయం మాత్రం నిజం మా అబ్బాయి హిందూ సంప్రదాయాలకు,మహిళలకు ఎక్కువ విలువ ఇచ్చేవాడు. ఇంట్లో కానీ, బయట గానీ లేడీస్ తో చాలా మర్యాదగా ఉంటాడు. అయితే మనసుకి నచ్చిన అమ్మాయి ఇంకా దొరకలేదు.

ఓ రోజు మా యాజమాన్యం ప్రదీప్ దగ్గరకు పెళ్లిచూపులు కాన్సెప్ట్ తెచ్చింది. మొదట్లో వద్దన్నాడు. కానీ అతని మనస్సుకి నచ్చిన అమ్మాయి దీని ద్వారా అయినా దొరుకుతుందేమోనని ఒప్పుకున్నాడు. అందుచేత నచ్చిన అమ్మాయి దొరికితే తప్పకుండ పెళ్లి చేసుకుంటాడు’అని ప్రదీప్ తల్లి స్పష్టం చేసారు.