MoviesTollywood news in telugu

Vamshi Paidipally లవ్ స్టోరీ తెలుసా?

Vamshi Paidipally Love Story : తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally), తమిళ నటుడు విజయ్ దళపతి (Vijay Thalapathy) కాంబో తెరకెక్కిన చిత్రం ‘వారసుడు’ (Varasudu). ఈ సినిమా విజయంతో మంచి జోష్ లో ఉన్నాడు వంశీ.

డైరెక్టర్ వంశీ పైడిపల్లి గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. తన లవ్ స్టోరీ గురించి వంశీ చెప్పుకొచ్చాడు. సినిమాకు కావలసిన హంగులన్నీ అతడి లవ్ స్టోరీలో ఉంటాయి. భద్ర సినిమా సమయంలో కాస్ట్యూమ్ డిజైనర్ శ్వేత తో పాటు మాలిని కూడా షూటింగ్ కి వచ్చిందట. అక్కడ ఆమెను చూసిన వంశీ పైడిపల్లి మనసు పారేసుకున్నాడు.

శ్వేతా ద్వారా నెంబర్ తీసుకుని ఫోన్ చేసి మాట్లాడాడట. ఆ సమయంలో అతడు సంతోషం గా ఉండడంతో లవ్ అని కన్ఫర్మ్ అయింది. ఇక ఆమె బెంగుళూరులో ఉండగా దిల్ రాజు కారు తీసుకుని ఓ కాఫీ షాపులో ఆమెకు ప్రపోజ్ చేసాడు. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పడంతో నేను లవ్ చేస్తున్నానని అన్నాడట. 

ఇక ఇంట్లో వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు కూడా ఒప్పుకోలేదట. అదే సమయంలో తొలి సినిమా మున్నా ఫెయిల్యూర్ అయింది. ఇక లాభం లేదని తండ్రిని ఒప్పించి అవతలి వాళ్ళతో మాట్లాడించి మరీ పెళ్లి చేసుకున్నాడట. ఇలా తన లవ్ ని సక్సెస్ చేసుకుని సక్సెస్ సినిమాలతో దూసుకెళ్తున్నాడు.