ఈ పొడిని ఇలా తీసుకుంటే డయాబెటిస్ నుంచి కొలెస్ట్రాల్ వరకూ.. ఎన్నో రోగాలకు దివ్యౌషధం
Cinnamon Benefits In Telugu : చెట్టు బెరడు నుంచి వచ్చే దాల్చిన చెక్క… మంచి సువాసన రావటమే కాకుండా వంటల్లో ఇది హాట్ స్పైస్ కూడా. స్నాక్స్‌లో కూడా దీన్ని చల్లుకుంటారు. మనలో చాలా మంది ఒక మసాలా దినుసుగానే భావిస్తారు. కానీ దీనిలో ఉన్న ప్రయోజనాలను తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.
దాల్చిన చెక్క పొడిని తేనెలో కలిపి తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి అధిక బరువు సమస్య నుండి బయట పడతారు. డయాబెటిస్ ఉన్నవారు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో చిటికెడు దాల్చిన చెక్క పొడిని కలిపి తాగితే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సూచించిన మందులను వాడుతూ ఈ చిట్కాను ఫాలో అవ్వాలి.
దాల్చినచెక్క పొడిని, తేనెతో కలిపి తీసుకోవాలి. లేదంటే టీలో దాల్చిన చెక్క పొడిని వేసుకొని తాగొచ్చు. ఇలా తీసుకోవటం వలన జలుబు, గొంతులో నొప్పి, మంట, గరగర వంటివి తగ్గుతాయి. పొట్ట మొత్తం క్లీన్ అయ్యి గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉండవు. రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.
దాల్చిన చెక్క పొడిలో నిమ్మరసం కలిపి మొటిమలు,నల్లని మచ్చలు ఉన్న ప్రదేశంలో రాస్తే చాలా సులువుగా తగ్గిపోతాయి. కీళ్ల నొప్పులు తగ్గించడంలోనూ దాల్చిన చెక్క కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలోని నిస్సత్తువను దూరం చేసి రోజంతా సరిపడే శక్తిని ఇస్తుంది. దాల్చిన చెక్కను ఎక్కువగా వాడితే వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి రోజులో రెండు చిటికెల పొడిని మాత్రమే వాడాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.