Movies

అకిరా నిజస్వరూపం చూస్తే షాక్ అవుతారు

పులి కడుపున పులి పుడుతుందన్న మాట వింటుంటాం. ఒక్కోసారి తండ్రికి తగ్గ తనయుడు కాడనే వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల ప్రేమకు గుర్తుగా అకిరా నందన్, ఆద్య జన్మించారు. రేణు, పవన్ లు విడిపోయినప్పటికీ రక్త సంబంధం విడిపోదు కదా. ఓ పక్క పవన్ జనసేన నేతగా జిల్లాల పర్యటన చేస్తూ,ప్రత్యర్థులపై తూటాలాంటి మాటలు విసురుతున్నాడు. మరోపక్క అభిమానులను, కార్యకర్తలను వెంన్నంటి ఉంటూ వారిలో ధైర్యం నింపుతున్నాడు. ఇక రేణు కూడా రెండో పెళ్ళికి సిద్ధమంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో పెట్టి సంచలనం రేపింది. ప్రజా క్షేత్రంలో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబాన్ని కూడా పవన్ బానే పట్టించుకుంటున్నాడు.

ఇటీవల ఎపి రాజధాని అమరావతిలో దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కుటుంబ సభ్యులతో కల్సి దర్శించాడు పవన్. ప్రత్యేక వాహనంలో వచ్చిన పవన్ కుటుంబానికి అర్చక స్వాములు , ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్బంగా అకిరా ప్రవర్తన వెరైటీగా వుంది. ఓ విధంగా అందరినీ ఆకట్టుకుంది. పవన్ కి సరైన వారసుడు అకిరా అని అందరూ గుసగుసలాడుకోవడం చర్చనీయాంశం అయింది.

అన్నా లెజినోవా, పోలనా, ఆద్య, అకిరా లతో పవన్ ఆలయంలో శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. ఈ సందర్బంగా తీవ్ర ఉక్కపోతగా ఉన్నప్పటికీ అకిరా ఎక్కడా అసహనం ప్రదర్శించలేదు. ఓవైపు తన ఇద్దరి చెల్లెల్లు ఆద్య ,పోలనా లను అంతమంది జనంలోనూ జాగ్రత్తగా చూసుకుంటూ గర్భ గుడిలో ప్రవేశించాడు. గుడిలో కూడా తండ్రి పక్కనే నిల్చుని వినయం విధేయతలు ప్రదర్శించాడు.

ఇదంతా పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు గమనిస్తూ తమ స్టార్ పవన్ కి తగ్గ వారసుడు అకిరా అని సంబర పడిపోయారు. గోత్ర నామాలతో పవన్ అభిషేకం చేయించుకునే టప్పుడు కూడా అకిరా ముఖంలో ఆధ్యాత్మిక భవనాలు గోచరిస్తూనే వున్నాయి, ఎక్కడా అసహనం కనిపించలేదు. మరోవైపు అన్నా లెజినోవాను తల్లిగా ట్రీట్ చేస్తూ వ్యవహరించిన తీరు పలువురిని ఆకట్టుకుంది. ఇక ఆలయంలో ఉక్కపోత తట్టుకోలేక చమట తుడుచుకుంటూ వచ్చాడే గానీ ఎక్కడా ఇబ్బంది ఫీలవ్వలేదు.

పైగా గుడిలో ఉండగా, సెక్యూరిటీ సిబ్బంది ‘అసౌకర్యంగా ఉందా ఏర్పాట్లు ఏమైనా చేయాలా’ అని అడిగితే, అకిరా హుందాగా వద్దని వారిస్తూ పవన్ వారసుడంటే ఎలా ఉంటాడో నిరూపించాడు. జిల్లాల పర్యటనలో ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్న పవన్ నిజానికి ఎవరి గురించి వ్యక్తిగత వైరాన్ని మనసులో పెట్టుకోడని సన్నిహితులు అంటుంటారు. తనను నేరుగా దూషించిన వాళ్ళను కూడా ఈనాటికే ఒక్కమాట అనలేదు.

చంద్రబాబు , లోకేష్ లను విమర్శించినా అదికూడా వ్యక్తిగతంగా కాదని, ప్రజలకోసమేనని అంటుంటారు. సరిగ్గా అలాంటి లక్షణాలే చిన్నోడైన అకీరాలో కనిపిస్తున్నాయని, చదువుకునే దశలో వున్నా, అప్పుడే ఎంతో పరిణతి చెందాడని అభిమానులు మురిసిపోతున్నారు. భవిష్యత్తులో సినీ రంగాన్ని ఏలడంతో పాటు , అటు రాజకీయాల్లో కూడా అరంగేట్రం చేసి తానేమిటో నిరూపిస్తాడని అభిమానులు చెప్పుకొస్తున్నారు.