బిత్తిరి సత్తి అలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఇదేనా ?
ఒకప్పుడు పొట్ట చేత్తో పట్టుకుని ఉద్యోగం కోసం వచ్చిన బిత్తిరి సత్తి ఇప్పడు అధిక మొత్తంలో జీతం పొందుతూ దర్జా గా జీవనం సాగిస్తున్నాడు. టాలెంట్ ఉంటే, ఎప్పుడో కప్పుడు అవకాశం ఖచ్చితంగా వస్తుందనడానికి ఇతనికి వస్తున్న అవకాశాలే నిదర్శనం. బిత్తిరి సత్తి అసలు పేరు చేవెళ్ల రవి. వి6 ఛానల్ లో తీన్ మార్ ద్వారా పాపులర్ ఆయన రవి రంగారెడ్డి జిల్లా పమేనా గ్రామానికి చెందిన వ్యక్తి. ఆది నుంచి ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొన్న రవి ,వివిధ రకాల వ్యక్తులను చూసి అందరినీ ఇమిటేట్ చేయడం మొదలు పెట్టాడు. ఫ్రెండ్స్ సూచన మేరకు హైదరాబాద్ వచ్చిన రవికి ఉద్యోగం చాలా కష్టాల తర్వాత వచ్చింది.
అదికూడా జి తెలుగులో కామెడీ క్లబ్ షో కార్యక్రంలో ఫస్ట్ ఛాన్స్ తగిలింది. ఈ షో ఊహించని విధంగా సక్సెస్ కావడంతో వి 9 ఛానల్ లో తీన్ మార్ ప్రోగ్రాం లో వార్తలు చదివే అరుదైన అవకాశం లభించింది.బుల్లితెరపై తీన్ మార్ న్యూస్ ఎంత పాపులర్ అంటే చెప్పనవసరం లేదు. అందుకే రవి దశ మారిపోయి బిత్తిరి సత్తిగా పాపులర్ అయ్యాడు.
తెలుగు రాష్ట్రాల్లో సత్తి పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఇతని కోసమే కేవలం తీన్ మార్ న్యూస్ వీక్షించే వాళ్ళున్నారు కూడా. నిజానికి ఈ న్యూస్ బిత్తిరి సత్తి కోసమే డిజైన్ చేసారా అన్నట్లు వుంటుంది. ఇక ఈ ప్రోగ్రాం కోసం సదరు ఛానల్ యాజమాన్యం లక్షన్నర రూపాయల వేతనం నెలకు అందిస్తోంది.
ఇక బయట షోలకు, కార్యక్రమాలకు రోజు రెండు లక్షల నజరానా అందుకుంటున్నాడు. ఇక సినీమాల్లో నటిస్తే, 20లక్షలు దాకా ముడుతోందట. తీన్ మార్ కన్నా బయటే ఎక్కువ ఆదాయం వస్తున్నందున తీన్ మార్ ని వదిలేసి, సత్తి పర్మినెంట్ గా బయట ప్రోగ్రాం లకే అంకితం అయిపోతాడని అంటున్నారు. అదే జరిగితే తెలంగాణ ప్రజలకు రోజూ తొమ్మిదిన్నరకు సత్తి కనబడడు. అయితే తీన్ మార్ ని ఫాలో అయ్యేవాళ్ళు సత్తి నిర్ణయాన్ని ఎంతవరకూ రిసీవ్ చేసుకుంటారో చూడాలి.