Movies

పెళ్ళికి సిద్దమైన తాప్సి….పెళ్ళికొడుకు ఏ రంగానికి చెందిన వాడో తెలుసా?

ఝుమ్మంది నాదం మూవీతో టాలీవుడ్ లో పరిచయమైన స్లిమ్ బ్యూటీ తాప్సి ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అయిపొయింది. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి జంప్ చేసిన ఈ ఢిల్లీ భామ కొద్దికాలంలోనే దక్షిణాదిన పాపులారిటీ సొంతం చేసుకుంది. బాలీవుడ్ పై కన్నేసిన ఈ ఢిల్లీ భామ ముంబైయిలో ఫ్లాట్ కొనుక్కుని చెల్లెలు షాగున్ తో కల్సి అక్కడే మకాం పెట్టింది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న నానుడికి అనుగుణంగా నూతన తారల ఆలోచనలకు తార్కాణం ఈ ఢిల్లీ బ్యూటీ.ఎలాంటి పాత్ర వచ్చినా సరే, కాదనకుండా ఒప్పుకోవడం ద్వారా దూసుకుపోతోంది. దీనికి తోడు ఈ భామ నటించిన లేటెస్ట్ మూవీ ‘జుబ్బా -2’ హిట్ కొట్టడంతో ఛాన్స్ లు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు తనకు లైఫ్ ఇచ్చిన తెలుగులో ఆది పినిశెట్టి సరసన నీవెవరు చిత్రం కూడా ఒప్పుకుంది.

అయితే గత కొద్ది కాలంగా డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాధ్యుస్ తో లవ్ లో పడడమే కాదు డేటింగ్ కూడా చేస్తున్నట్లు బాలీవుడ్ లో గుప్పుమంటోంది. అంతటి ఆగకుండా బాయ్ ఫ్రెండ్ తో పెళ్ళికి కూడా తాప్సి సిద్ధమైందట. జుబ్బా సీక్వెల్ తర్వాత భారీగా సినిమాలు ఒప్పుకుని, ప్రేమలో కూడా పడి కొన్ని రోజుల్లో పెళ్ళికి సిద్ధపడుతోందని వార్తలు తెరపైకి వచ్చాయి.

తాప్సి బాయ్ ఫ్రెండ్ మాధ్యుస్ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ఆటగాడు. ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ విజేతగా నిలిచాడు. 2013లో ఇండియాలో బ్యాడ్మింటన్ లీగ్ నేపథ్యంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. కారణం హైదరాబాద్ టీమ్ కి తాప్సి బ్రాండ్ అంబాసిడర్. అప్పట్లో టోర్నమెంట్ కి వచ్చిన మాధ్యుస్ ఆ తర్వాత టోర్నమెంట్ లేకున్నా ఇండియాకు వస్తూనే వున్నాడు.

ఇక ఈమధ్యే మాధ్యుస్ తో పాటు తాప్సి,ఆమె సోదరి షాగున్ గోవా వెళ్లడం చర్చనీయాంశం అయింది. ఎందుకంటే అక్కడే కొందరి బంధు మిత్రుల నడుమ నిశ్చితార్ధం కూడా జరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ‘తడ్కా’,’సుమ్మా ‘,మల్క’, పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా, మంజరి మూవీ సెట్స్ పై వుంది. ఇక ఇవన్నీ పూర్తయ్యేక పెళ్లి చేసుకుంటుందా,లేక ముందే పెళ్ళయితే ఆతర్వాత నటిస్తుందా అనేది తాప్సి నిర్ణయం మీద ఆధార పడివుందని విశ్లేషకులు అంటున్నారు.