బిగ్ బాస్ హౌస్ గుట్టు విప్పిన శ్యామల… ఆ రహస్యాలు ఏమిటో తెలుసా?
నాని హోస్ట్ గా నడుస్తున్న బిగ్ బాస్ సీజన్ షో లో కంటెస్టెంట్ శ్యామల ఎలిమినేట్ అవ్వడం గురించి తెలుగు రాష్ట్రాల్లో సృష్టించిన ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. శ్యామల ఎలిమినేషన్ అన్యాయమంటూ ప్రతి ఒక్కరూ స్పష్టం చేస్తున్నారు. అయితే గియితే రోత పుట్టిస్తున్న తేజస్విని తప్పించాలే గానీ డీసెంట్ గా ఆడుతున్న శ్యామలను బయటకు సాగనంపడం ఏమిటని నెటిజన్లు తీవ్రంగా నిలదీస్తున్నారు. ఇక కొందరు నెటిజన్లు అయితే బిగ్ బాస్ టీమ్ కుట్ర ఫలితంగానే శ్యామల ఎలిమినేషన్ అయిందంటూ విమర్శించడం చూస్తుంటే, అసలు ఈకార్యక్రమంలో ఎంతగా ఆడియన్స్ లీనమయ్యారో చెప్పక్కర్లేదు. ఇదిలా ఉంటే, షో నుంచి నేరుగా ఇంటి కొచ్చిన శ్యామల తన ఇంటికి చేరుకుని, తన నెలల పసికందుని తనివితీరా ముద్దాడింది. మాతృత్వ ప్రేమను అందించి పులకించిపోయింది.
ఇక అభిమానుల కోసం బయటకొచ్చిన శ్యామల మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లో గడిపిన రోజులన్నీ ఎంతో ఆనందంగా గడిచిపోయాయని,ఫాన్స్ ని ఇన్నాళ్లూ మిస్ అవ్వడం మాత్రం కాస్త బాధ కలిగించిందని చెప్పుకొచ్చారు. తనను బయటకు పంపినందుకు ఏమాత్రం బాధలేదని అయితే తన స్టాటజీ ఏమిటో హౌస్ లో ప్రదర్శించక ముందే ఎలిమినేషన్ కావడం బాధగా ఉందని చెప్పింది.
బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చేముందు అందరిని గమనించానని, ఇక పక్కాగా ప్లాన్ అమలుచేసే సమయంలో ఎలిమినేట్ కావడం విచారంగా ఉందని శ్యామల పేర్కొంది. ఇక వస్తూ వస్తూ, తన క్లోజ్ ఫ్రెండ్ దీప్తిపై బిగ్ బాంబ్ వేయడం వెనుక దిమ్మతిరిగే విషయాలు వెల్లడించింది.
గత కొన్నాళ్లుగా బిగ్ బాస్ హౌస్ లో చర్మ వ్యాధులు పెరిగిపోయాయని, కంటెస్టెంట్లు చాలామంది దురదలతో బాధపడుతున్నారని, అయితే దీనికి కారణం బట్టలు సరిగ్గా ఉతక్క పోవడమేనని చెప్పింది. కంటెస్టెంట్లలో అందరికన్నా బాగా బట్టలు ఉతికేది దీప్తి మాత్రమేనని చెప్పింది. తన ప్రాణ స్నేహితురాలు అయినప్పటికీ ఆమెపైనే బిగ్ బాంబ్ వేశానని అసలు విషయం శ్యామల నింపాదిగా చెప్పింది