Movies

కాబోయే భర్తపై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్…. ఏమిటో తెలిస్తే షాక్ అవ్వటం ఖాయం

పవన్ వైఖరి కారణంగా అతనితో విడాకులు తీసుకున్నట్లు చెప్పి, సంచలనం రేపిన రేణు దేశాయ్ ఇప్పుడు తనకు కాబోయే భర్త ఎవరనే విషయం వెల్లడించకుండా సప్సెన్స్ కొనసాగిస్తోంది. అందుకే పెళ్లయ్యాకే తన భర్త వివరాలు వెల్లడిస్తానని అంటోంది. ఇక పెళ్లి ప్రక్రియ నేపథ్యంలో కాబోయే భర్తకు ఓ రోజంతా క్లాస్ తీసుకున్నట్లు రేణు చెబుతోంది. ‘ ఆయన మెచ్యూర్డ్ , నా బ్యాక్ గ్రౌండ్ మొత్తం ఆయనకు తెలుసు. అన్నీ తెలిసే పెళ్లి చేసుకుంటున్నాడు’అని వెల్లడించింది.భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఓరోజు మొత్తం కూర్చోబెట్టి ‘నా బ్యాక్ గ్రౌండు ఇదీ. సమస్యలు వస్తాయి. భవిష్యత్తు ఇలా ఉంటుంది’అని కూడా మొత్తం చెప్పేసానని రేణు పేర్కొంటూ, ఏ అబ్బాయి అయినా, తనను మాత్రమే కాకుండా తన పూర్వ జీవితం తో సహా అన్నీ ఓ ప్యాకేజీగా అంగీకరించాలన్నదే తన ఉద్దేశ్యమని ఆమె అంటోంది.

ఇది కుదరదు, అది కుదరదు అంటే చెల్లదు. నా పరిస్థితి ఇది. నా పిల్లలు .. నేను ఇలా ఉంటా’అని చెప్పడంతో మొత్తం అంగీకరించి పెళ్లి చేసుకోడానికి ముందుకు వచ్చాడని తనకు కాబోయే భర్త గురించి రేణు చెప్పుకొచ్చింది.’నిజానికి ఇదంతా పిల్లల కోసమే. పిల్లలు ఒప్పుకున్నాకే నేను ఓకే చెప్పాను. ఆయన చాలా సైలెంట్ . కూల్ పర్సన్. అయన అంటే పిల్లలకు చాలా ఇష్టం.

అందుకే ఆయనకు అకిరా, ఆద్య బాగా కనెక్ట్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే,వాళ్ళ ముగ్గురూ చాలా క్లోజ్ గా వున్నారు. నేనే బయట ఉన్నట్టు ఉంది. నాకు పెద్దలు కుదిర్చిన సంబంధం ఇది. అందుకే ఆయనతో పూర్తిగా లవ్ లో పడలేదు. అయితే ఏదో ఒకరోజు పూర్తిగా లవ్ లో పడతాను’అని రేణు స్పష్టం చేసింది.

పూర్తిగా ఆయనపై ప్రేమ కలగకపోయినా ఏదోకరోజు తప్పనిసరిగా లవ్ పుడుతుందేమో. ఎందుకంటే ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన నాకు పూర్తి మనసు కి శాంతినిస్తున్నాడు. ఇక పెళ్లయ్యాక ఓ నెల గ్యాప్ ఇచ్చి ,ఆతర్వాత కెరీర్ కొనసాగిస్తా’అని రేణు ప్రకటించింది. అంతేకాదు పెళ్లి తర్వాత ఓ వెబ్ సిరీస్ కూడా చేసే ఆలోచనలో ఉందట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."