Movies

బ్రేకింగ్ న్యూస్ బిగ్ బాస్ నుండి బాబు గోగినేని అవుట్ .. ఎందుకో తెలుసా?

రియాల్టీ షో బిగ్ బాస్ షో లో తనదయిన శైలిలో వ్యవహరిస్తున్న బాబు గోగినేని హౌస్ నుంచి శుక్రవారం బయటకు వచ్చేసారు. పోలీసులు నోటీసులు పట్టుకుని బాబు ఇంటికి వెళ్లగా, అయన బిగ్ బాస్ హౌస్ లో ఉంన్నారని బాబు భార్య చెప్పడంతో నేరుగా పోలీసులు బిగ్ బాస్ యాజమాన్యాన్ని కలుసుకుని, విషయం వెల్లడించారు. అంతేకాదు బాబుని రిమాండ్ కి తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. దేశద్రోహం, ఆధార్ చట్టాలని ఉల్లంఘిస్తూ,ఇతరుల ఆధార్ సమాచారాన్ని పక్కదేశాలకు అందజేయడం,హేతువాద ప్రచారం కోసం విదేశాలనుంచి నిధుల సేకరణ వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.దీంతో ఇటీవల ఐపీసీ సెక్షన్ 121,121ఏ,153ఏ,153బి,406,420,504,505,295ఏ,292,293సెక్షన్స్ కింద కేసు నమోదు చేసిన సంగతి తెల్సిందే.

రెండు మతాల మధ్య మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడమే కాకుండా, శాంతి భద్రతలకు భంగం కల్గించేలా కూడా గతంలో ఆయన ఆరోపణలున్నాయి. అయితే ఇంతవరకూ ఆయనపై చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్ నేపథ్యంలో ఈనెల 25లోగా కౌంటర్ దాఖలు చేయాలనీ సైబరాబాద్ పోలీసులను కోర్టు ఆదేశించింది.

దీంతో బిగ్ బాస్ సీజన్ టు హౌస్ లో బలమైన కంటెస్టెంట్ గా ఉన్న బాబు గోగినేనికి నోటీసులు అందజేసే పనిలో పోలీసులు పడడంతో,బాబు బయటకు రావాల్సి వచ్చింది. బాగ్ బాస్ టీమ్ తో పోలీసులు సంప్రదింపులు జరిపారు. అయితే బిగ్ బాస్ హౌస్ నిబంధనల మేరకు హౌస్ లో ఎలిమినేషన్ అయితే తప్ప, కంటెస్టెంట్ బయటకు వెళ్ళకూడదు ఇదే పరిస్థితి బిగ్ బాస్ సీజన్ వన్ లో వచ్చింది. డ్రగ్ కేసులో ముమైత్ ఖాన్ పోలీసుల విచారణకు హాజరైంది.

ఇక అదే తరహాలో బాబు కూడా బయటకు రావాల్సి ఉంటుందని న్యాయనిపుణుల భావిస్తున్నారు. కోర్టుకి వెళ్లి, మళ్ళీ బిగ్ బాస్ హౌస్ కి బాబు వస్తారా అంటే, ఆయనపై గల కేసులు ఎక్కువగా ఉండడం, అరెస్టు తప్పకపోవడం, పైగా సెక్షన్ల తీవ్రత కూడా ఎక్కువే కావడం వంటి పరిస్థితుల నేపథ్యంలో 14రోజులు రిమాండ్ కి కూడా వెళ్లే పరిస్థితులు ఉన్నాయి.