Movies

కురుక్షేత్ర యుద్ధంలోని ఈ పాయింట్స్ తో అరవింద సమేత….సినిమా ట్రెండ్ సెట్ చేస్తుందా?

రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో మనం చాలా సినిమాలు చూసి ఉంటాం. అంతపురం పురం మొదలుకుని ప్రేమించుకుందాం రా,సమరసింహారెడ్డి, ఆది,ఇంద్ర,ఇలా చాలా సినిమాలే వచ్చాయి. ఏ సినిమా చూసినా సరే,హింసను చూపించేస్తూ చివరిలో మాత్రం ఇక ఆపేద్దాం అనే సందేశాన్ని వినిపించడం చేసారు. అయితే రాయలసీమ ఫ్యాక్షనిజం నేపధ్యంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత మూవీ తీశారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న తొలి మూవీ కావడంతో అందరిలో ఆసక్తి పెరిగిపోయి,భారీ హైప్ క్రియేట్ అయింది. యుద్ధం మిగిలిచిన కన్నీటి బిందువు చుట్టూ ఈ సినిమా నడుస్తుందని అంటున్నారు.

సెన్సార్ సర్టిఫికెట్ కూడా అందుకుని అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైన అరవింద సమేత స్టోరీ లైన్ గురించి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఫ్యాక్షన్ నేపధ్యం గల సినిమాయే అయినా త్రివిక్రమ్ శ్రీనివాస్ తనదైన శైలిలో ట్రీట్ మెంట్ ఇచ్చాడని అంటున్నారు. ఈ సినిమా టైటిల్ లో పావురం ఎగురుతూ కనిపిస్తుంది. దీన్ని బట్టి శాంతిసందేశం వినిపించారని అంటున్నారు.

నిజానికి కొత్తగా కథలు అంటూ ఏవీ లేకున్నా,పాతవాటికే మెరుగులు దిద్ది కొత్తగా చూపించే ప్రయత్నం ఇటీవల వస్తున్న సినిమాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రజెంటేషన్, టేకింగ్ వంటివి కీలకం అవుతున్నాయి. భిన్నకోణంలో చూపిస్తూ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నారు.ఇక అరవింద సమేత మూవీ మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం ఘటన ను బేస్ చేసికుని తనదైన శైలిలో త్రివిక్రమ్ టచ్ ఇచ్చాడని అంటున్నారు.

ఓడినవాడు ఏమైయ్యాడు,చనిపోయిన వారి కుటుంబాల సంగతేంటి వంటి అంశాలు ఇందులో చూపించబోతున్నారట. ఫ్యాక్షన్ నేపథ్యంలో బతుకులు ఎలా ఛిద్రమవుతున్నాయో, ఈ సినిమా ద్వారా సందేశం ఇస్తారట. మహాభారత యుద్ధం తర్వాత ఘటనలను ఆధారం చేసుకుని త్రివిక్రమ్ ఈ సినిమాకు రూపకల్పన చేసారని అంటున్నారు. ఇక ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా, జగపతి బాబు విలన్. మెగా బ్రదర్ నాగబాబు కీలక పాత్ర పోషించారు.