Movies

అమల నాగార్జున జీవితంలోకి రాకముందు జరిగిన కొన్ని సంఘటనలు…. నమ్మలేని నిజాలు

నటీ నటులకు కొన్ని ఇష్టా ఇష్టాలు ఉంటాయి. అయితే వాటిల్లో కొన్ని నెరవేరతాయి. మరికొన్ని అలానే ఉండిపోతాయి. అయితే కొందరు మంచి పనులు చేయాలని సంకల్పించి ఎలాగోలా చేసేస్తారు. మరికొందరు చేయడానికి అవకాశాలు దక్కవు. కానీ అక్కినేని అమల మాత్రం తాను అనుకున్నది చేయడానికి ఇంట్లోంచి పూర్తి సపోర్ట్ అందిపుచ్చుకుని ముందుకు వెళ్తున్నారు. మూగజీవులంటే మొదటినుంచీ ఎంతో ఇష్టపడే అమల వాటికి ఏ చిన్న బాధ కలిగినా, నొప్పి వచ్చినా అసలు తట్టుకోలేరు. మూగజీవాలు గాయపడిన, రోగాల బారిన పడి కొట్టుకుంటున్నా ఆమె వాటిని ఇంటికి తీసుకెళ్లి మరీ వైద్యం చేయించి సంరక్షిస్తారు. ఇక పెళ్లయ్యాక నాగార్జున ఇచ్చిన సలహాతోనే బ్లు క్రాస్ సంస్థను స్థాపించి,చెన్నైలో శిక్షణ కూడా పొందారు.అలా ఇప్పటివరకూ 4లక్షల మూగజీవాలను రక్షించారట. అక్కినేని నాగార్జున భార్యగా, మూగ జీవాల సంరక్షకురాలిగా,అన్నపూర్ణ ఇంటర్ నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా బాధ్యతలు చూస్తున్నారు.

అసలు అమలు మలయాళీ. ఈమె తండ్రి నేవి ఆఫీసర్. చిన్నప్పటినుంచి మూగజీవాలంటే ఎంతో ప్రేమ చూపే వారట. ఆరేళ్ళ వయసులో ఓ కాకి దెబ్బ తగిలి పడిపోతే దాన్ని ఇంటికి తెచ్చి,వైద్యం చేయించారట. ఇందుకు ఆమె తల్లి సహకారం అందించిందట. ఇక అప్పటినుంచి జంతు ప్రేమ మరింత పెరిగిందట. నాట్యం పట్ల ఇంట్రెస్ట్ తో డాన్స్ నేర్చుకున్న ఆమె వరల్డ్ వైడ్ గా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది. ఇక ఆమె డాన్స్ చూసిన తమిళంలో ప్రముఖ నటుడు,డైరెక్టర్ టి రాజేందర్ ఆమెను సినిమాల వైపు అడుగు వేయాలని కోరాడట.

అలా రాజేందర్ తెరకెక్కించిన ‘మైథిలి ఎన్నై కాకలీ’ తమిళ మూవీ ద్వారా వెండితెరపై మెరిసింది. డాన్స్ ప్రధానమైన చిత్రం కావడం, పైగా అమల నృత్య కళాకారిణి కావడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా నటించేసింది. ఆతర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. రజనీకాంత్,విజయకాంత్,ప్రభు ,సత్యరాజ్ తదితర హీరోల సరసన నటించింది. సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో వచ్చిన పుష్పక విమానంతో కమలహాసన్ తో నటించే ఛాన్స్ దక్కించుకుంది.

మాటలు లేని పుష్పక విమానం ద్వారా తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయిన అమల కిరాయిదాదా సినిమాతో నాగార్జున సరసన నటించి, నేరుగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అమల, అప్పుడే నాగార్జున తో ప్రేమలో పడిందని అంటారు. నిర్ణయం,శివ, చినబాబు,ప్రేమయుద్ధం నాగార్జున తో కల్సి నటించారు. రక్త తిలకం,అగ్గిరాముడు,రాజా విక్రమార్క,ఆగ్రహం,వంటి మూవీస్ లో హీరోయిన్ గా చేసారు.

తమిళ, తెలుగు,మలయాళం,కన్నడ,హిందీ బాషలలో దాదాపు 50పైగా చిత్రాల్లో నటించారు. నాగార్జున తో జీవితం పంచుకోవాలన్న అమల నిర్ణయం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ గా మార్చేసింది. 1991లో నిర్ణయం సినిమా పూర్తయ్యాక, నాగార్జున పెళ్లి ప్రపోజల్ తీసుకు రావడంతో అలా అడుగుతారని అమల అనుకోలేదట. ఇద్దరూ పరిణతి చెందాక తీసుకున్న నిర్ణయంతో 1992లో అమల ,నాగార్జున ఒక్కటయ్యారు.

ఆ తర్వాత సినిమాకు దూరంగా జరిగిపోయారు. కేవలం కుటుంబ బాధ్యతలను చోసుకోవడం పైనే దృష్టి పెట్టారు. రెండు దశాబ్దాల పాటు సినిమాల జోలికి వెళ్లని అమల,2012లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీతో మళ్ళీ వెండితెర మీద తళుక్కు మంది. ఈ సినిమాకు ఉత్తమ నటిగా సినీ, మా అవార్డు కూడా అందుకున్నారు.