Politics

జగన్ పై హత్యాయత్నం చేసిన వ్యక్తి ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే

రాజకీయ నేతలపై దాడులకు దిగడం అప్పుడప్పుడు వింటుంటాం,చూస్తుంటాం. అయితే తాజాగా విశాఖ ఎయిర్ పోర్టులో వైస్సార్ సిపి అధినేత వైఎస్ జగన్ పై జరిగిన దాడి తీవ్ర సంచలనం సృష్టించింది. ఎక్కడ చూసినా దీనిపై చర్చ నడుస్తోంది. రకరకాల ఊహాగానాలు,వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. ఇక విమర్శలు,ప్రతి విమర్శలతో హోరెత్తిపోతోంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండగా హత్యాయత్నం జరగడం పట్ల పలువురు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. విస్తృతంగా తనిఖీ చేసి పంపించేటప్పుడు కోడిపుంజుకి కట్టే కత్తి ని ఎలా చూడకుండా వదిలేశారని ప్రశ్నిస్తున్నారు. ఎయిర్ పోర్టు ముందు పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

అసలు సెల్ఫీ తీసుకుంటానని వచ్చిన వ్యక్తి కత్తితో దాడికి తెగబడడం ఘటనలోకి వెళ్తే,దాడికి పాల్పడిన దుండగుడు శ్రీనివాస్ అమలాపురం ప్రాంతానికి చెందిన వ్యక్తని, ఇంటర్ వరకూ చదువుకున్నాడని అంటున్నారు. అక్కడి రెస్టారెంట్ లో ఈ దుండగుడు పనిచేస్తున్నాడని, సదరు రెస్టారెంట్ హర్ష వర్ధన్ అనే వ్యక్తిదని, అతడు గతంలో గాజువాక టిడిపి టికెట్ కోసం ప్రయత్నాలు కూడా చేసాడని అంటున్నారు.

ఈ దాడిపట్ల పౌర విమానయాన శాఖామంత్రి సురేష్ ప్రభు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తంచేస్తూ,ఇది పిరికిపందల చర్యగా అభివర్ణించారు. ఘటనపై విస్తృత దర్యాప్తుపై అన్ని సంస్థలను ఆదేశించినట్లు ట్విట్టర్ లో ఆయన వెల్లడించారు. ఈ ఘటన వెనుక ఎవరున్నారో తెల్సుకుని కఠినంగా శిక్షించడానికి చర్యలు చేపట్టాలని తమ శాఖ కార్యదర్శికి చెప్పామని ఆయన తెలిపారు.

ఇక ఎపి డిజిపికి గవర్నర్ నరసింహన్ ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఘటన తర్వాత హైదరాబాద్ చేరిన జగన్ కి పార్టీ శ్రేణులు ఎదురేగి స్వాగతం పలికారు. తమ అభిమాన నేతపై దాడి ఘటనను జీర్ణించు కోలేకపోతున్నామని అంటున్నారు.