కోమలి సిస్టర్స్ గుర్తు ఉన్నారా…. బంపర్ అఫర్ కొట్టేసిన కోమలి సిస్టర్…. ఎవరు ఊహించని అఫర్
సినిమా కన్నా బుల్లితెర ప్రభావం ఎక్కువే. అందుకే బుల్లితెర మీద కనిపించిన వాళ్ళను ఆడియన్స్ బాగా గుర్తుపెట్టుకుంటున్నారు. బుల్లితెరపై నటించేవాళ్లకు, కనిపించేవాళ్లకు పాపులార్టీ కూడా బాగా వస్తోంది. అలా ఒకప్పుడు బుల్లితెరపై కోమలి సిస్టర్స్ విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు. పిల్లలు కాదు పిడుగులు అన్నట్లు చిన్నప్పుడు వారు టివి ప్రేక్షకులను మైమరపించారు. ఈ టివి ఛానల్ లో చూసినా కోమలి సిస్టర్స్ దే హవా అన్నట్లు ఉండేది. చంద్రబాబు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి లా డైలాగులు చెబుతూ అందరినీ అలరించారు. కోమలి సిస్టర్స్ అసలు పేర్లు హీరోష్ని కోమలి,దేవర్షిణి కోమలి. అత్తా కోడళ్ల పాత్రలు , తోడికోడళ్లు పాత్రలతో అదరగొట్టేసేవారు.
కోమలి సిస్టర్స్ ఖమ్మంలో పుట్టిన్నా పెరిగింది హైద్రాబాద్ లోనే. బాల్యం నుంచి మిమిక్రి పై ఆసక్తి పెంచుకుని వందలాది ప్రోగ్రామ్స్ ఇచ్చారు. డాక్టర్ వైఎస్ సీఎం గా ఉండగా ఆయన ఎదుట ఆయన్ని అనుకరించి ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. అందులో పెద్దమ్మాయి హీరోష్ని కోమలి అయితే ఇంకా మారిపోయింది. స్లిమ్ గా, బ్యూటీగా, లేలేత పరువాలతో హీరోయిన్ కి ఉండాల్సిన లక్షణాలను పుణికి పుచ్చుకున్న ఈమె టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.
సినీ హీరోయిన్ గా ఎదగాలన్నది హీరోష్ని కోమలి కోరిక. మిమిక్రి ప్రోగ్రామ్స్ మానేసింది. నాలుగేళ్ల నుంచి స్టేజ్ షో లకు దూరంగా ఉంటున్న ఈమె జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్ కోర్సు చేస్తోంది. ఇక కొన్నాళ్ల క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అ ఆ మూవీలో ఓ చిన్న పాత్రలో తళుక్కున మెరిసింది. ఫిలిం మేకింగ్ కోర్స్ చేసిన ఈమె సత్యానంద్ మాస్టర్ దగ్గర థియేటర్ వర్క్ షాప్ లో నటనకు సంబందించిన మెళుకువలను నేర్చుకుంది.
మెరుపు తీగ లాంటి శరీరం కోసం రెగ్యులర్ గా జిమ్ , ఆహరం పట్ల శ్రద్ధ కనబరుస్తోంది. ఇందుకోసం రవితేజ, రానా, రకుల్ ప్రీత్ సింగ్, అంజలి వంటి సెలబ్రిటీలు వెళ్లే జిమ్ కి వెళ్తోంది. ఇక తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ డాటర్ పాత్రకు ఎంపికైంది. బాలకృష్ణ,విద్యాబాలన్ వంటి హేమాహేమీలతో కల్సి నటిస్తున్న హీరోష్ని కోమలి కి ఎన్టీఆర్ బయోపిక్ పునాది అవుతుందని, భవిష్యత్తులో హీరోయిన్ గా రాణిస్తుందని అంటున్నారు.