Movies

‘ఫిదా” సినిమాలో హీరోగా ముందు ఎవరిని అనుకున్నారో తెలుసా.?

వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరో, హీరోయిన్స్ గా నటించిన ‘ఫిదా’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెల్సిన విషయమే. ఈ సినిమాలో సాయి పల్లవి తెలంగాణ యాస,ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యిపోయారు. ఎందుకంటే ఆమె మలయాళీ భామ అయినా తెలుగును తెలంగాణ యాసలో మాట్లాడింది. ఫిదా హిట్ కావటంతో ఆమెకు తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టిన సినిమాలని ఆచి తూచి ఎంచుకుంటుంది. అయితే ‘ఫిదా’ సినిమాకి సంబంధించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

‘ఫిదా’ సినిమాలో మొదటగా మహేష్ బాబును అనుకున్నారట. మహేష్ కి కొన్ని కారణాల కారణంగా కుదరలేదు. అప్పుడు దిల్ రాజు సలహా మేరకు ఆ అవకాశం వరుణ్ తేజ్ కి వచ్చింది.

సాయి పల్లవి కోసం ‘ఫిదా’ టీమ్ దాదాపుగా ఆరు నెలలు వరకు వెయిట్ చేసారు. ఆమె డాక్టర్ చదువు పూర్తి అయ్యాక సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది.

తక్కువ బడ్జెట్ తో రూపొంది ఎక్కువ వసూళ్లను పొందిన సినిమాగా నిలిచింది.

సాధారణంగా మనం సినిమాను ఒకసారి చూస్తాం. బాగా నచ్చితే మరోసారి చూసాం అంతే. కానీ తెలంగాణాలో ఈ సినిమాను పదిసార్లు చూసిన ఆడియెన్స్ కూడా ఉన్నారట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."