Movies

మహేష్ జీవితాన్ని నమ్రత ఎలా మార్చేసిందో తెలుసా? ఎన్ని కోట్లు సంపాదిస్తుందో?

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా నిల్చి సూపర్ స్టార్ పొజిషన్ లోకిమహేష్ బాబు వచ్చాడంటే,దీనివెనుక ఆయన భార్య నమ్రత కృషి ఎంతో ఉందని చెప్పాలి. సాధారణ గృహిణిగా, ఇద్దరు పిల్లల తల్లిగా నమ్రత ఇంటికే పరిమితం కాకుండా మహేష్ కెరీర్ కి సంబంధించి అన్ని విషయాలు ఆమె చూస్తుంది. మేహేష్ స్టాండర్డ్ మార్కెట్ లో పెంచడంలో ఆమె కీలక భూమిక వహిస్తోంది. సినిమా సైన్ చేయడం దగ్గర నుంచి టీజర్, ట్రైలర్, డిస్ట్రిబ్యూషన్ ఇలా అన్ని దగ్గరుండి ఆమె చూస్తుంది. అంతేకాదు సూపర్ స్టార్ భార్యననే గర్వానికి పోకుండా తోటి నటులు రామ్ చరణ్ భార్య ఉపాసన,బన్నీ భార్య స్నేహతో కల్సి మెలసి ఉంటూ వారి బిజినెస్ లు విదేశాల్లో సెట్ చేయడం,మహేష్ పేరిట ఈవెంట్స్ చేయడంలో సక్సెస్ అయింది.

ఇక మహేష్ సొంతూరు బుర్రిపాలెం ను మహేష్ దత్తత తీసుకోవడంతో దగ్గరుండి అక్కడ జరిగే ప్రతిపనిని పర్యవేక్షిస్తూ ఘట్టమనేని స్టామినా ఏమిటో చాటిచెప్పింది. నిజానికి పోకిరి సినిమాకు ముందు వరుస ప్లాప్ లు చుట్టుముట్టడంతో నమ్రత చొరవ తీసుకుని,కాస్ట్యూమ్ డిజైనర్ గా మారి రొటీన్ లుక్స్ కి భిన్నంగా మార్చేసి,మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా చేసేసింది.

ఇక మహేష్ ఫాదర్ కృష్ణను దాడి అని పిలుస్తూ సొంత కూతురికన్నా ఎక్కువగా ఆదరిస్తుంది. పిల్లలు గౌతమ్,సితార లకు సంబంధించి ఎప్పుడూ బిజీగా ఉండేలా చూస్తూ, వారికి ఈక్వల్ రైట్స్ ఇస్తూ పెంచాలన్న కాన్సెప్ట్ కూడా ఫ్యామిలీని ఆకట్టుకుంది. భవిష్యత్తులో స్టార్స్ గా చేయడానికి నమ్రత ఓ హింట్ కూడా ఇచ్చారని అంటున్నారు.

సినిమా శాశ్వతం కాదన్న విషయం కూడా గమనించి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న రీతిలో వేరే లాభదాయక రంగాల్లో పెట్టుబడులు పెట్టడం, వాటిని దగ్గరుండి చూసుకోవడం చేస్తోంది. ఏ ఎంబి సంస్థతో కల్సి మహేష్ మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగుపెట్టడం కూడా నమ్రత ప్లాన్ లో భాగమే. మహేష్ వాటా 20శాతం అయినప్పటికీ మరికొంత వాటా దక్కేలా చేయడం ద్వారా ఆమె చతురత ఏమిటో చెప్పొచ్చు .