Movies

తొలి చిత్రాలను చెప్పకుండా వీళ్ళు ఎందుకు దాచేస్తున్నారో తెలుసా?

చాలామంది హీరో హీరోయిన్స్, నటీనటులు స్టార్ డమ్ తెచ్చుకున్నాక తమ తొలిచిత్రాలను అసలు ప్రస్తావించడానికి ఇష్టపడరు. వాళ్లకి ఛాన్స్ ఇచ్చి ప్రోత్సహించిన తొలి మూవీ చిన్న చిత్రం అవ్వడం వలన పెద్దగా గుర్తుంచుకోరు. పైగా అలాంటి చిత్రాన్ని దాచేస్తారు కూడా. చిత్ర రంగ ప్రవేశానికి ఊతమిచ్చిన వాళ్ళను ప్రస్తావించడానికి ఎందుకో జంకుతారు. బ్రేక్ ఇచ్చిన సినిమాలనే ప్రస్తావిస్తారు. అలాంటి వాళ్ళ లిస్టు పెద్దగానే ఉందండోయ్. వాళ్లెవరో చూద్దాం.

ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ లో సమంత మొదటి చిత్రం ‘ఏం మాయ చేసావే’అనే చిత్రం అనుకుంటాం. ఆమె కూడా అదే చెప్పేస్తుంది. కానీ అంతకుముందు ‘మాస్కో ఇన్ కావేరి’మూవీ గురించి అసలు చెప్పనే చెప్పదు. నిజానికి ఈ సినిమా ద్వారానే అందాల రాక్షసి ఫేమ్ రాహుల్ రవీంద్రన్,సమంత పరిచయం అయ్యారు. కానీ ఎక్కడా చెప్పడానికి సమంత ఇష్టపడదు. కారణం ఈ సినిమా ప్లాప్ అవ్వడమే.

ఇక స్టార్ హీరోగా వెలుగొందుతూ, ఆత్మహత్య చేసుకున్న ఉదయ కిరణ్ కూడా తేజ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం మూవీలో నటించి సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమానే మొదటి సినిమాగా చెప్పేవాడు తప్ప అంతకుముందే నటించిన సినిమా గురించి చెప్పలేదు. కారణం ఆసినిమా మధ్యలోనే ఆగిపోయి, చాన్నాళ్లు విడుదలకు నోచుకోలేదు. లేడీ గెటప్ లో కూడా వేసిన ఆ సినిమా జోడి నెంబర్ వన్. ఇందులో లేడి గెటప్ ఇష్టం లేకపోవడంతో డేట్స్ ఇవ్వకపోవడంతో సదరు నిర్మాత కోర్టుకు వెళ్లడం,దాంతో డేట్స్ ఇచ్చి పూర్తిచేసాడు.

స్టార్ హీరోయిన్ గా , టివి షోల్లో యాంకర్ గా, జడ్జిగా రాణిస్తున్న రోజా విషయానికి వస్తే,ఆమెకు తొలిచాన్స్ ఇచ్చింది డాక్టర్ శివప్రసాద్. ఈయన అప్పట్లో తీసిన ప్రేమ తపస్సు మూవీలో రాజేంద్ర ప్రసాద్ సరసన రోజాకు ఛాన్స్ ఇచ్చారు. కొంచెం నల్లగా ఉన్నప్పటికీ ఆమెలోని చలాకీతనం చూసి,ఆ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. ఇక శివప్రసాద్ టిడిపి ఎంపీగా ఉన్నారు. రోజా వైసిపి ఎమ్మెల్యేగా కొనసాగుతుండడంతో ఇద్దరూ తిట్టుకుంటూ ఉంటారు. అయితే తనకు సినిమా జీవితం ప్రసాదించిన శివ ప్రసాద్ కి విలువ ఇవ్వకపోవడం విశేషం.

ఇక కన్నడ భామ సంఘవి విషయం తీసుకుంటే, తెలుగులో ఈమెకు మంచి హిట్స్ ఉన్నాయి. అయితే అప్పటివరకూ విలన్ వేషాలు,కేరక్టర్ నటుడిగా రాణించిన శ్రీకాంత్ ని హీరోగా పరిచయం చేస్తూ డాక్టర్ డి రామానాయుడు తీసిన తాజ్ మహల్ మూవీ లో మోనికా బేడీ జంటగా నటించింది. అయితే ఇదే సినిమాలో సంఘవి కూడా నటించడంతో ఇదే ఆమెకు తొలిసినిమా అనుకుంటారు. అయితే రోజాను పరిచయం చేసిన డాక్టర్ శివప్రసాద్ కొక్కొరొకో మూవీ నటుడు శశికుమార్ ని హీరోగా పెట్టి తీసిన ఈ సినిమా లో సంఘవిని హీరోయిన్ గా పరిచయం చేసాడు. ఆ సినిమా గురించి అస్సలు చెప్పేది కాదు.

కమెడియన్ గా నిలదొక్కుకున్న ఒకప్పటి ప్రొడ్యూసర్ దువ్వాసి మోహన్ తీసిన ప్రేమే నా ప్రాణంలో వరుణ్ రాజ్,ఆమని జంటగా పరిచయం అయ్యారు. ఇక ఆసినిమా తర్వాత మరికొన్ని సినిమాలు తీసి,అవి డిజాస్టర్ అవ్వడంతో దువ్వాసి మోహన్ అప్పులపాలైయ్యాడు. దీంతో జూనియర్ ఆర్టిస్టుగా వేషాలు వేసుకుని బతికే పరిస్థితి వచ్చింది.

మరి ఆమని మాత్రం స్టార్ హీరోయిన్ గా రాణించి,పెళ్లయ్యాక ఇప్పుడు కేరక్టర్ ఆర్టిస్టుగా చేస్తోంది. అయితే ఎక్కడా కూడా తొలిమూవీ గురించి గానీ, దువ్వాసి మోహన్ గురించి గానీ మాట్లాడిన సందర్భాలు లేనేలేవు.
వీళ్ళే కాదండోయ్ సీనియర్ నటుడు ఎన్టీఆర్ తొలిసినిమా విషయంలో కూడా కొన్ని అనుమానాలున్నాయి. ఎల్వీ ప్రసాద్ పరిచయం చేశారని అనుకోవడం పరిపాటి అయింది. అయితే అది వాస్తవం కాదని దర్శక రత్న డాక్టర్ దాసరి నారాయణరావు అనే వారు.