500 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహం… బయటపడ్డ 5 నమ్మలేని నిజాలు
వెండితెర ఇలవేల్పు ,రాజకీయాల్లో ప్రభంజనమై తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటిన నందమూరి తారకరామారావు విగ్రహాలు రాష్ట్రంలో పలు చోట్ల ఉన్నాయి. అయితే ఎపి రాజధాని అమరావతి దగ్గరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయించింది. ఈ భారీ విగ్రహ ప్రాజెక్ట్ నమూనాను సీఎం చంద్రబాబు నాయుడు ఖరారు చేశారట. నీరుకొండ కొండపై 32మీటర్ల ఎత్తుపై నిర్మించే భవనం మీద 60మీటర్ల ఎత్తులో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పాలన్నది ప్రణాళిక.
పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తూ, మొత్తం 200 ఎకరాల్లో ఎన్టీఆర్ మెమోరియల్ ప్రాజెక్ట్ గా తీర్చిదిద్దనున్నారు. వాణిజ్య కూడలిగా కూడా తీర్చిదిద్దడం ద్వారా ప్రాజెక్ట్ వ్యయాన్ని సొంతంగా సమకూర్చుకోవాలన్న ప్రతిపాదన వచ్చిందట. కొండచుట్టూ జలాశయాన్ని తీర్చిదిద్ది, మధ్యలో విగ్రహం వచ్చేలా చేస్తారట. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు 406కోట్లు ఖర్చవుతుందని అంచనా. కేవలం విగ్రహానికి 155 కోట్లు ఖర్చవుతుందని అంటున్నారు. చుట్టూ ఆడిటోరియం,సెల్ఫీ పాయింట్,ఫెర్రీ,మినీ థియేటర్,స్టార్ హోటల్,షాపింగ్ సెంటర్ కూడా ఏర్పాటుచేయనున్నారట. రెస్టారెంట్లు కూడా ఉంటాయట.
ఎన్టీఆర్ స్మారకాన్ని దాదాపు 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటుచేయనున్నారు. అదనపు హంగుల కోసం మరో 112కోట్ల రూపాయలు అవసరమవుతాయట. 46 మాసాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రాజెక్ట్ కోసం విరాళాల సేకరణ చేపట్టాలని భావిస్తున్నారట. ఇందుకోసం ట్రస్ట్ కి రూపకల్పన చేస్తారట. సి ఆర్ డి ఏ సమావేశంలో ఎన్టీఆర్ స్మారక ప్రాజెక్ట్ నమూనాను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఈ విగ్రహం దగ్గర లిఫ్ట్ లు అమర్చుతారట. లిఫ్ట్ ల ద్వారా సందర్శకులు విగ్రహం పైవరకూ వెళ్లి రాజధాని అమరావతిని వీక్షించేలా చేయాలన్నది ఈ ప్రణాళికలో ఉందట. ఇక విగ్రహం లోపలే ఎన్టీఆర్ మ్యూజియం కూడా ఏర్పాటుచేస్తారట.