సాక్షి శివానంద్ గుర్తుందా? ఇప్పుడు ఏం చేస్తుందో, ఎవరిని పెళ్ళి చేసుకుందో తెలుసా!
సాక్షి శివానంద్ తెలుగులో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరోయిన్.ఈమె తెలుగులో నే కాకుండా హింది, తమిళ్, కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేసి మంచి పేరు సంపాదించుకుంది. సాక్షి పన్నెండేళ్ల క్రితం ‘మాస్టర్’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ అమ్మడు ఆ తర్వాత నాగ్, చిరు, మహేష్ ,బాలయ్య, రాజశేఖర్, జగపతి బాబు, శ్రీకాంత్ వంటి అగ్ర హీరోలతో సినిమా చేసి ఎంతో పేరు సంపాదించుకుంది.
అయితే ఉన్నట్టుండి అంతలోనే టాలీవుడ్ నుంచి మాయమైంది. ఐదేళ్ల క్రితం వచ్చిన ‘హోమం’ సినిమాలో ఐటెం సాంగ్ ద్వారా మళ్లీ ఇక్కడ ప్రత్యక్షమైంది. ‘రంగ ది దొంగ’ సినిమాలో ‘మిల మిల మిల మీనాక్షి..’ అంటూ సాగే పాటలో మళ్లీ తళుక్కున మెరిసింది. ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు. గత యేడాది ఆమె ఒక హిందీ సినిమాలో నటించింది. స్వస్థలం ముంబయి అయిన ఈమె అక్కడే స్థిరపడిపోయింది. ఇక..
తెలుగులో మళ్లీ కధానాయిక గా నటించాలని వుందని చెబుతోంది సాక్షి. అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు కూడా చేస్తోంది. అయితే, టాలీవుడ్ లో మాత్రం సాక్షిని పట్టించుకునే నిర్మాతలెవరూ కనపడటం లేదట. గతంలో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించి కనుమరుగైన కొంత మంది హీరోయిన్లు మళ్లీ ఇప్పుడు అవకాశాలు వెతుక్కుంటూ టాలీవుడ్ కే వస్తున్నారు.
అలాంటి వారిలో సాక్షి శివానంద్ కూడా వుంది. తెలుగులో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానని పాత్ర బాగుంటే సినిమా చేస్తానని చెబుతోంది సాక్షి. అందుకే హిందీలో ఆమెకు నచ్చిన పాత్రలు వస్తే సినిమాలు చేస్తున్నట్లు చెప్పింది.
ఇక ఈమె పెళ్ళి కూడా సాగర్ అనే ఒక బిజినెస్ మెన్ తో జరిగింది. సాక్షి శివానంద్ పెళ్ళి చేసుకున్న విషయం కూడా చాలా మందికి తెలీదు. ఎందుకంటే ఆమె పెళ్ళి ఫోటోలు కూడా బయటకు రాలేదు. అంత సీక్రెట్ గా చేసుకుంది. ఇక ఆమె తన భర్త కు ఉన్న వ్యాపారాలు చూసుకుంటూ, నచ్చిన సినిమాలు చేస్తూ ఉంది.