Politics

తెలంగాణ ఎన్నికల్లో ఘోర పరాభవం పొందిన టాలీవుడ్ స్టార్స్

ఎన్నికలన్నాక గెలుపు ఓటములు సహజం. అందుకే రాజకీయ నేతలు ఎన్నికల ఫలితాలను లైట్ గా తీసుకుంటారు. అయితే సినిమా వాళ్ళు పోటీ చేసి ఓడిపోతే పరాభవంగా భావిస్తారు. ఒపట్టాన జీర్ణించుకోలేరు. తాజాగా తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో టిఆర్ ఎస్ ప్రభంజనం ముందు ఎవరూ అగలేకపోయారు. సినీ స్టార్స్ కూడా ఓటమి పాలయ్యారు. వాళ్లెవరో ఓసారి చూద్దాం.ఈ రోజుల్లో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రేష్మ రాధోడ్ తెలంగాణ ఎన్నికల్లో బిజెపి తరపున పోటీచేసి దారుణంగా ఓడిపోయింది. సినిమాల్లో మంచి అవకాశాలు వచ్చినా,అనుకున్న సమయంలో అనుకున్నట్టు వ్యవహరించకపోవడంతో కెరీర్ మధ్యలోనే ముగిసింది.

దీంతో రాజకీయ రంగం వైపు దృష్టి సారించి, బీజేపీలో చేరిన రేష్మ రాథోడ్ ఖమ్మం జిల్లాలోని ఓ ఏరియా నుంచి పోటీ చేసింది. అయితే టిఆర్ ఎస్ ప్రపంజనం ముందు రేష్మ దారుణంగా ఓడిపోయి , పరాభవం పొందింది. ఆమె గ్లామర్ తెలంగాణ ప్రజానాలు ఏ మాత్రం ఆకర్షించలేక పోయింది.
ఇక టాలీవుడ్ లో భారీ చిత్రాలు తీసిన భవ్య క్రియేషన్స్ అధినేత ఆనంద్ ప్రసాద్ కూడా రేష్మ బాటలో దారుణంగా ఓడిపోయారు.

హీరో గోపీచంద్ తో సూర్యం,వాంటెడ్,సౌఖ్యం,వంటి మూవీస్ నిర్మించిన ఆనంద్ ప్రసాద్ ఇటీవల శమంతకమణి,నర్తన శాల ,పైసా వసూల్ వంటి మూవీస్ చేసి టాలీవుడ్ లో బెస్ట్ ప్రొడ్యూసర్ గా నిలదొక్కుకున్నారు. అయితే డబ్బులు మాయ చేయలేవని నిరూపిస్తూ,ఆనంద్ ప్రసాద్ కి తెలంగాణ ప్రజలు ఓటమి చూపించారు.

మరో కాంట్రవర్సీ స్టార్ బాబూ మోహన్ వరుస వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. తన వివాదాస్పద వైఖరి కారణంగా టిఆర్ ఎస్ నుంచి టికెట్ కోల్పోయి,భారతీయత జనతా పార్టీ తరపున పోటీచేసిన బాబు మోహన్ పరాభవం చవిచూడాల్సి వచ్చింది. సినిమాల్లో ఎంతగా కామెడీ చేసినా జనం అభిమానం పొందడంలో బాబుమోహన్ ఫెయిలయ్యారు. ఆనంద్ ప్రసాద్,బాబుమోహన్ లకు డబ్బులున్నందున పర్వాలేదు. అయితే సినిమాల్లో తేడా వచ్చిందని రాజకీయాల్లోకి వచ్చిన రేష్మ ఇప్పుడు రాజకీయాల్లోనూ నెగ్గలేదు.మరి రాజకీయాల్లో కొ నసాగుతుందో,మళ్ళీ సినిమాల్లోకి దూరుతోంది వేచి చూడాలి.