Movies

అల్లు అర్జున్ కి చెర్రీకి ఎంత తేడా ఉందో తెలుసా?

మెగా ఫ్యామిలీలో ఇద్దరు హీరోల మధ్య చాలా తేడా ఉందని ఎప్పుడైనా గమనించారా? లేదంటే అవేంటో ఒకసారి చూడండి, అల్లు అరవింద్ తనయుడిగా, అల్లు రామలింగయ్య మనవడిగా గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తక్కువకాలంలోనే తన నటన, స్టెప్పులతో జనంలో ఓ క్రేజ్ తెచ్చుకున్నాడు. మెగా అభిమానుల్లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీ రంగంలో హీరోగా చిరుత మూవీతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ కూడా తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.

అయితే ఎంత కష్టపడితే అంతటి ప్రయోజనం సిద్ధిస్తుందని నమ్మే బన్నీ ఏ పాత్రలోనైనా పరకాయప్రవేశం చేసేసి , ఆ పాత్రకోసం ప్రాణం పెట్టేస్తాడు. కేవలం డాన్స్ లతోనే కాకుండా తన పాత్ర డిఫరెంట్ గా ఉండాలని భావిస్తాడు. డిఫరెంట్ రోల్స్ కోసం హెయిర్ స్టైల్, బాడీ లాంగ్వేజ్,సిక్స్ పాక్ బాడీ ఇలా అన్నింటితో అలరిస్తాడు. గతంలో నాపేరు సూర్య , సరైనోడు మూవీస్ కోసం కండలు పెంచడమే కాదు,నా పేరు సూర్యలో మిలట్రీ ఆఫీసర్ గా ఏకంగా కంటికి గాటు పెట్టేసుకున్నారు.

కాగా దువ్వాడ జగన్నాధం కోసం బ్రాహ్మిన్స్ బాడీ లాంగ్వేజ్ నేర్చుకుని మెప్పించాడు. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీకోసం బాగా సన్నగా కనిపించడానికి సిద్ధం అయ్యాడు. మరి రామ్ చరణ్ విషయం తీసుకుంటే,చాలా తేడా ఉంటుంది. బన్నీకి అసలైన పోటీదారు చెర్రీ మాత్రం సినిమా ఒప్పుకున్నామా , చేశామా,అయిపోయిందా అన్నట్లు ఉంటాడని విశ్లేషకులు అనేమాట. ఎందుకంటే మగధీర తర్వాత చాలా సినిమాలు చేసినా అన్నింట్లో ఒకటే లుక్ లో దర్శనమిస్తాడు.

కొత్తదనం కోసం ట్రై చేయకపోవడం వల్లనే ఆశించిన స్థాయిలో విజయాలు నమోదు కావడం లేదన్నది క్రిటిక్స్ చెప్పేమాట. వినయ విధేయ రామ, రచ్చ, గోవిందుడు అందరి వాడేలే సినిమాల్లోని స్టిల్స్ పక్కన పెట్టి చూస్తే, ఏ స్టిల్ ఏ మూవీలోదో చెప్పడం కష్టమని అంటున్నారు. మరి బన్నీని చూసి చెర్రీ ఇప్పటికైనా కొంతలో కొంత నేర్చుకుంటే తిరుగుండదని కొందరు బాహాటంగా చెప్పేస్తున్నారు.