Devotional

ఉత్తరాయణం, దక్షిణాయనం అంటే ఏంటో తెలుసా?

మన పూర్వికులు సూర్య భగవానుని గమనం ప్రకారం యుగాలుగానూ, యుగాలను సంవత్సరములుగానూ, సంవత్సరములను మాసములుగానూ, మాసములను వారములుగానూవారములను రోజులుగానూ, రోజులను జాములుగానూ, జాములను ఘడియలుగానూ కాల గమనాన్ని తెలుసుకోవటానికి విభజించారు. సంవత్సరంలో ఉన్న 12 మాసములను రెండు ఆయనాలుగా విభజించారు.సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం, కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయణం ఏర్పడతాయి.

ఒక్కో అయనం ఆరు నెలల పాటు ఉంటుంది. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం క్యాలండర్ ప్రకారం ప్రతి జనవరి 1నుండి జూలై 15 వరకు ఉత్తరాయణం అని జూలై 16 నుండి జనవరి 14 వరకు ఉండే కాలాన్ని దక్షిణాయణం అని అంటారు.
దక్షిణాయనంలో దేవతలునిద్రిస్తారు . ఆ సమయంలోనే ఎక్కువ పండుగలు వస్తాయి. ఆ సమయంలో మనం చేసే పూజల కారణంగా దేవతలకు శక్తి లభిస్తుంది.

ఉత్తరాయణంలో దేవతలు మేల్కొంటారు ఈ సమయం చాలా మంచిది. ఈ సమయంలో శుభకార్యాలు చేస్తే మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ ఉత్తరాయణంలో దేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి వివాహాలు చేయటానికి కూడా మంచి సమయం.