Politics

మోదీ సంపద ఎంత… ఆస్తులు,అప్పులు…???

దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి వారణాసి నుంచి బరిలో దిగడానికి సమాయత్తమై నామినేషన్ దాఖలు చేసారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రచార పర్వం సాగిస్తున్న మోడీ నామినేషన్ వేయడానికి వారణాసి లో భారీ ఊరేగింపుతో వెళ్లారు. వారణాసి రోడ్లన్నీ జనసంద్రంతో నిండిపోయాయి. నామినేషన్ సందర్భంగా ఆస్తులు,తదితర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసారు. స్థిర చరాస్తులు కలిపి రెండు కోట్ల 51లక్షల 36వేల119రూపాయలు ఉండగా, అప్పులు అసలు లేవు. ఇక ఆయన పేరిట వాహనాలు కూడా లేవు. ఒక కోటి 41లక్షల 36వేల119రూపాయల విలువైన చరాస్తులు ఉన్నాయి.

గుజరాత్ లోని గాంధీ నగర్ లో 3,531. 45 చదరపు అడుగుల స్థలం ఉంది. దాని మార్కెట్ విలువ 1కోటి 10లక్షల రూపాయలుగా చూపించారు. 1967లో గుజరాత్ లో ఎస్ ఎస్ సి పూర్తిచేసి,1978లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ , 1983లో గుజరాత్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తిచేసినట్లు అఫిడవిట్ లో తెలిపారు. ఇక ఐదేళ్లలో 72లక్షల 3వేల921రూపాయల ఆదాయం వచ్చినట్లు మోడీ అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇక ఆయన దగ్గర నాలుగు బంగారు ఉంగరాలున్నాయి. వాటి విలువ ఒక లక్షా 13వేల800రూపాయలు. ఇక అయన భార్య  పేరున అఫిడవిట్ లో పొందుపరిచిన ఆమె పాన్ కార్డు,ఆస్తులు,అప్పులు తనకు తెలియవని అఫిడవిట్ లో రాసారు.