గుర్తు పట్టకుండా మారిన మీరా జాస్మిన్…. ఇప్పుడు ఎలా ఉందో చూడండి

మళయాళ కుట్టి మీరా జాస్మిన్ రన్ మూవీతో ఎంట్రీ ఇచ్చి తొలిచిత్రంతోనే తన సత్తా చాటింది.తమిళం,తెలుగు,కన్నడం ,మళయాళం ఇలా దక్షిణాది భాషలన్నింటా ఒక ఊపు ఊపేసిన మంచి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. పెళ్లితర్వాత నటనకు దూరమైనా ఈమె మళ్ళీ ఎంట్రీ ఇవ్వబోతోందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హీరోయిన్ గా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే మళయాళ డైరెక్టర్ ప్రేమలో పడింది. ఆ తర్వాత వివాదాల సుడిలో కొట్టుమిట్టాడి ఆతర్వాత ఓ ఇంజనీర్ ని పెళ్ళాడి, నటనకు  విశ్రాంతి ఇచ్చేస్తూ భర్తతో కల్సి దుబాయిలో సెటిల్ అయింది. గత ఏడాది చెన్నైలో ఓ నగల షాపు ఓపెనింగ్ కి వచ్చిన ఈమెను చూసి, ఇంతలావెక్కిందేమిటని అందరూ ఆశ్చర్యపోయారు. వాస్తవానికి సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన మీరా ఎన్నో అవార్డులు దక్కించుకుంది. నేషనల్ అవార్డులు సైతం దక్కించుకున్న మీరా చేసిన సినిమాల కన్నా వచ్చిన అవార్డులు ఎక్కువని చెప్పాలి.

గుడుంబా శంకర్ మూవీలో పవన్ కళ్యాణ్ తో నటించి తెలుగులో ఫేమస్ అయిన ఈమె 2015లో రవితేజతో కల్సి భద్ర సినిమాలో చేసింది. అది బ్లాక్ బస్టర్ అయింది. తమిళంలో సండకోడి మూవీతో చాలా పాపులర్ అయింది. ఇది తెలుగులో పందెం కోడిగా డబ్ అవ్వడంతో ఇక్కడా మంచి పేరుతెచ్చుకుంది. రారాజు,యమగోల మళ్ళీ మొదలైంది, మహారథి,గోరింటాకు,మా ఆయన చంటిపిల్లాడు,ఆకాశ రామన్న ,బంగారు బాబు,అ ఆ ఇ ఈ వంటి మూవీస్ లో నటించింది. 2009లో చేసిన ఆకాశ రామన్న మూవీ మీరా కు తెలుగులో చిట్టచివరి మూవీ. తర్వాత తెలుగు మళయాళం మూవీస్ లో ఎక్కువగా చేసింది. తర్వాత పెళ్లిచేసుకోవడంతో దుబాయ్ లో సెటిల్ అయింది. అయితే ఇటీవల మళయాళ డైరెక్టర్ అరుణ్ గోపి దుబాయ్ వెళ్లి మీరాతో సెల్ఫీ దిగారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫొటోలో మీరా జాస్మిన్ చాలా సన్నగా బక్కచిక్కిపోయింది. సినిమాలో రీ ఎంట్రీ కోసమే ఇలా సన్నబడిందన్న వార్తలు వస్తున్నాయి. ఇక ఆమె ఫాన్స్ అయితే వెల్కమ్ చెప్పేస్తూ ట్వీట్ చేస్తున్నారు. అయితే హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా అక్క, వదిన పాత్రల్లో సెట్ అవుతుందా అనేది చూడాలి.