Movies

హీరో,హీరోయిన్స్ మీద గాసిప్స్ రాస్తున్నాడనే నెపంతో యాక్టర్స్ అంతా కలిపి జర్నలిస్ట్ ని ఎలా చంపారో తెలుసా?

సినిమా పత్రికలంటే సినిమా వాళ్ళని ఆకాశానికి ఎత్తేయడమే కాదు,ఫలానా సినిమా ఇలా ఉంది,అలా వుంది అని రాస్తూ, నటీనటుల చీకటి కోణాల్ని కూడా ఎత్తి చూపడం సినిమా తొలినాళ్లలో బలంగానే ఉంది. ఆరోజుల్లో సంచలన జర్నలిస్ట్ ఉన్నాడా అంటే ఉన్నాడని చాటి చెప్పడానికి లక్ష్మీకాంతం అనే ఓ తమిళ జర్నలిస్ట్ హత్యోదంతం ఇందుకు ప్రబల నిదర్శనం గా చెప్పవచ్చు. తూ తూ అనే తన పత్రిక ద్వారా సినిమా వాళ్ళ చీకటి జీవితాలను తెరమీదికి తెచ్చేవాడు. తొలి సంచిక నుంచే సంచలనాలను ప్రచురిస్తూ తన సత్తా చాటాడు. ఇతడిని ఎలాగోలా వదిలించుకోవాలని అనుకునే సినీ సెలబ్రిటీ లు ఎందరో ఉన్నారట. చివరకు అన్నంత పని, అత్యంత కిరాతకంగా హతమార్చారు. 

లా చదవాలని  అనుకున్న లక్ష్మీకాంతం ఆర్ధికంగా ఏమాత్రం స్థితి మంతుడు కాడు. కోర్టు పక్షిగా మారిన లక్ష్మీకాంతం కేసులను లాయర్ల దగ్గరకు తీసుకెళ్లి కమీషన్స్ తీసుకుని జీవనం సాగించేవాడు. దొంగ రికార్డులను సృష్టించడం,ఫోర్జరీలు చేయడం వంటివి కూడా దండిగానే నేర్చుకున్నాడు. ఇక ఓ దొంగ సంతకం కేసులో 1935లో శిక్ష కూడా పడిన లక్ష్మీకాంతం పోలీసుల కళ్లుగప్పి పారిపోవడంతో అతడిని గాలించి పట్టుకుని ఏడేళ్లు జైలు శిక్ష కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. అంతేకాదు ప్రమాదకారిగా గుర్తించి అండమాన్ జైలుకి తరలించారు.

అయితే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అండమాన్ జైలులో వాళ్ళని బ్రిటిషర్లు విడుదల చేయడంతో లక్ష్మీకాంతం కూడా బయట పడ్డాడు. ఇక 1940కాలంలో చెన్నై చేరిన లక్ష్మీకాంతం మద్రాసు సినీ రంగమైతే నాలుగు డబ్బులు వస్తాయని,జర్నలిజం తనకు సులువని భావించి, 1949లో సినిమా తూ తూ అనే పత్రిక ను స్థాపించాడు.

తారల వ్యక్తిగత జీవితాలను, భాగోతాలను బట్టబయలు చేస్తూ ఇతగాడు రాసే రాతలకు సినీ ప్రముఖులకు దిమ్మతిరిగి పోయేది. మింగలేక కక్కలేక ఒకవేళ ఖండన ప్రకటన ఇస్తే తిరుగులేని సాక్ష్యాలతో మళ్ళీ రాసేసి వాళ్ళ నోళ్లు మోయించేవాడు. అయితే నోట్ల కట్టలు చూపిస్తే వాళ్ళను వదిలేసి,కుదరకపోతే బండారం బయట పెట్టడం చేసేవాడు. దీంతో అప్పటి గవర్నర్ కి పిర్యాదు చేయడంతో పత్రిక మూల  పడిపోయింది. ఆతర్వాత హిందూ నైజం పేరిట మరో పత్రిక పెట్టి,మరింత రెచ్చిపోయాడు.

ఇక లాభంలేదని ఎలాగోలా తప్పించాలని భావించిన కొందరు పధకం వేశారు. ఓరోజు లాయర్ తో మాట్లాడి రిక్షాలో వెళ్తున్న లక్ష్మీకాంతం ను దుండగులు దారికాచి కత్తితో పొడిచి పారిపోయారు. అయితే ఎలాగోలా లాయర్ దగ్గరికి వెళ్లి,అటునుంచి పోలీస్ స్టేషన్ కి వెళ్లి పిర్యాదు చేసి మరీ,ఆసుపత్రిలో చేరి మర్నాడు చనిపోయాడు. ఇక ఈకేసులో త్యాగరాజ భాగవతార్ అనే హీరో,కమెడియన్ కృష్ణన్ లు ఆరోపణలు ఎదుర్కొని జీవిత ఖైదు శిక్ష అనుభవించారు. రెండున్నరేళ్ల తర్వాత విడుదలైనా ఆతర్వాత వారిద్దరూ మరణించారు.