Healthhealth tips in telugu

ప్రతి రోజు చిన్న బెల్లం ముక్క తినే అలవాటు ఉందా…ఊహించని ప్రయోజనాలు ఎన్నో…

Jaggery Health Benefits In telugu : బెల్లం ఒక తియ్యని ఆహార పదార్ధం. దీనిని చెరకు రసం నుండి తయారుచేస్తారు. పంచదార కన్నా బెల్లం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెప్పటంతో బెల్లం వాడకం ఎక్కువ అయింది. పంచదారతో పోలిస్తే బెల్లంలో అధికంగా పోషకాలు ఉన్నాయి. చాలా మంది స్వీట్స్ తయారీలో బెల్లాన్ని వాడుతూ ఉంటారు. రసాయనాలు కలిపి తయారుచేసిన బెల్లం పసుపు రంగులో ఉంటుంది.
Diabetes unnavaru bellam thinavacha
రసాయనాలు కలపకుండా తయారుచేసే బెల్లం ముదురు రంగులో ఉంటుంది. ఈ బెల్లాన్ని ఆర్గానిక్ బెల్లం అని అంటారు. చాలా మందికి బెల్లం ఆరోగ్యానికి మంచిదా కాదా అనే సందేహం ఉంటుంది. అటువంటి వారు ఈ ఆర్టికల్ చదివితే ఆ సందేహం తీరిపోతుంది. బెల్లంలో ఐరన్, గ్లూకోస్, సుక్రోజ్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
Jaggery Health Benefits in Telugu
బెల్లం తయారు చేసే స‌మ‌యంలో హైడ్రాన్‌(స‌ల్ఫ‌ర్‌), సోడియం కార్బొనేట్‌, సూప‌ర్ ఫాస్ఫేట్ వంటి రసాయనాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నట్టు ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది. ఈ రసాయనాలను బెల్లం మంచి పసుపు పచ్చని రంగు రావటానికి కలుపుతారు. అయితే ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయి. అందువల్ల ఎటువంటి రసాయనాలను కలపని బెల్లం ముదురు రంగులో ఉంటుంది. ఈ బెల్లమే ఆరోగ్యానికి మంచిది.
gas troble home remedies
ఇప్పుడు బెల్లం తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. బెల్లంలో ఉండే ఔషధ గుణాలు జీర్ణాశయంలోని డైజెస్టివ్ ఎంజైమ్‌లను యాక్టివేట్ చేస్తాయి. దాంతో మలబద్దకం, గ్యాస్, ఏసీడీటీ వంటి సమస్యలు కూడా ఉండవు. బెల్లంలో కేలరీలు తక్కువగా ఉండుట వలన బరువు పెరుగుతామనే బెంగ కూడా ఉండదు.
Liver Cleaning
ప్రతి రోజు చిన్న బెల్లం ముక్కను తింటే లివర్ లోని హానికర వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు పోయి లివర్ శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటుంది. బెల్లంలో పొటాషియం ఎక్కువగా ఉండుట వలన  శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంగా ఉండేలా చేయటమే కాకూండా శరీరంలో అధికంగా ఉన్న నీటిని బయటకు పంపిస్తుంది. అంతేకాక రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. బెల్లంలో ఐరన్ సమృద్ధిగా ఉండుట వలన రక్తాన్ని శుద్ధి చేసి  శరీరంలో హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచి రక్త హీనత సమస్య రాకుండా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.