Movies

బన్నీ కోసం అన్న బాబీ చేసిన త్యాగం తెలుసా?

తండ్రి తన పిల్లలందరినీ సమానంగానే చూస్తాడు. అలాగే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా చేసాడు. తనకు గల ముగ్గురు పిల్లలు బాబీ, అర్జున్,శిరీష్ లను ఒకేలా చూసాడు. అయితే పెద్ద కొడుకు బాబీని తనలాగా ప్రొడక్షన్ పనులు చూస్తావా, హీరోగా అవుతావా అని అరవింద్ అడిగితె తమ్ముడు బన్నీ కోసం బాబీ పెద్ద త్యాగం చేసాడని చెబుతారు. బన్నీ విజయం వెనుక తండ్రి అరవింద్ కృషి కంటే అన్నయ్య బాబీ కృషి ఎక్కువ అని అంటారు. 

తమ్ముడికి డాన్సులు అంటే ఇంట్రెస్ట్ ఉంది. వాడిని హీరోని చేద్దాం. హీరోగా నిలబెట్టడానికి వెనుక ఉండి చేయాల్సిన పనులు చేస్తా అని తండ్రి ఇచ్చిన ఆఫర్ కి బాబీ బదులిచ్చాడట. అలా చెప్పడమే కాదు మొదటి సినిమా రాఘవేంద్రరావు ని సూచించడం లో కూడా బాబీ హ్యాండ్ ఉందట. యాక్టింగ్ స్కూల్ లో చేర్చడం,ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ పరిశీలించి ఎంకరేజ్ చేయడం వంటివి బాబీ చేసేవాడట. అందుకే టాలీవుడ్ లో బన్నీ స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. 

ఇక కథల విషయంలో కూడా సలహాలు ఇస్తూ తమ్ముడు బన్నీ నిలదొక్కుకోవడానికి బాబీ చేయని కృషి లేదని అంటారు. మాస్ హీరోగా ఉండడం వలన వచ్చే లాభాలు వివరించే వాడట. ఒకవేళ బన్నీ కన్నా ముందు బాబీ హీరో అయితే బన్నీ పరిస్థితి ఎలా ఉండేదో , ఒకవేళ అప్పుడు బన్నీ హీరో అయినా సరే,ఇప్పుడున్నంత క్రేజ్ వచ్చేది కాదేమో. ఇక బాబీ పెళ్ళికి బన్నీ షూటింగ్ ఉన్నందున తనకోసం షూటింగ్ మానుకోవద్దని,ఇది సడన్ గా జరిగే పెళ్లి కనుక పర్వాలేదని కూడా చెప్పాడట.