ఈ కొత్త పాలసీతో చేతికి ఒకేసారి రూ.5 లక్షలు.. అటుపైన మీరు బతికినంత కాలం ప్రతి నెలా రూ.10,000!

మార్కెట్‌లోకి కొత్త కొత్త ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా ఎగాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మరో కొత్త పాలసీని లాంచ్ చేసింది. ఐటర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలోనే ఇదొక కొత్త వెర్షన్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. ఈ కొత్త ఎగాన్ లైఫ్ ఐటర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో ప్రతి నెలా డబ్బులు పొందొచ్చు.

రిటైర్మెంట్ తర్వాత అంటే 60 ఏళ్లు దాటిన తర్వాతి నుంచి రెగ్యులర్‌గా డబ్బులు వస్తాయి. 100 ఏళ్ల వరకు ఇలా డబ్బులు పొందొచ్చు. ఇందులో మూడు ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. డ్యూయెల్ ప్రొటెక్ట్, లైఫ్ ప్రొటెక్ట్, ప్రొటెక్ట్ ప్లస్ అనేవిఆప్షన్లు. వీటిల్లో పాలసీదారుడు దేనినైనా ఎంచుకోవచ్చు.

డ్యూయెల్ ప్రొటెక్ట్ ఆప్షన్ కింద కుటుంబ సభ్యులకు భద్రత కల్పించడమే కాకుండా 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా డబ్బులు కూడా పొందొచ్చని ఎగాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో వినీత్ అరోరా తెలిపారు. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి (నాన్ స్మోకర్) రూ.కోటి మొత్తానికి 100 ఏళ్ల వరకు పాలసీ కవర్ తీసుకుంటే.. అతనికి డ్యూయెల్ ప్రొటెక్ట్ ఆప్షన్ కింద 60 ఏళ్లు దాటిన తర్వాత ఒకేసారి రూ.5 లక్షలు అందిస్తారు. తర్వాత ప్రతి నెలా రూ.10,000 మొత్తం పొందొచ్చు.

అదే 30 ఏళ్ల నాన్-స్మోకర్ 50 ఏళ్ల టర్మ్‌తో రూ.2 కోట్లకు పాలసీ తీసుకుంటే.. అప్పుడు 60 ఏళ్ల వరకు ఏడాదికి రూ.63,770 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పాలసీదారుడరికి 60 ఏళ్ల తర్వాత ఒకేసారి రూ.10 లక్షలు అందిస్తారు. అటుపైన ప్రతి నెలా పాలసీ టర్మ్ ఉన్నంత వరకు రూ.20,000 లభిస్తాయి.

పాలసీ ప్రత్యేకతలు..

ప్రతి నెలా రెగ్యులర్‌గా ఆదాయం పొందొచ్చు. 60 ఏళ్ల తర్వాత ఈ ప్రయోజనం అమలులోకి వస్తుంది.

పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా లైఫ్ కవర్ ప్రతి ఏడాది పెరుగుతూ వస్తుంది.

హెల్తీ లైఫ్‌స్టైల్‌కు మారితే రివార్డు పాయింట్లు కూడా అందిస్తారు.

ఫ్లెక్సిబుల్ పాలసీ టర్మ్, ప్రీమియం పేమెంట్ ఆప్షన్లు.

స్మోకింగ్ చేసే వారు ఆ అలవాటు మానుకుంటే.. పాలసీ ప్రీమియం తగ్గుతుంది.

కొన్ని ఏళ్ల వరకు ప్రీమియం చెల్లించి అటుపైన కూడా పాలసీ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.

పాలసీదారుడు మరణిస్తే లభించే మొత్తాన్ని తీసుకోవడానికి కూడా మూడు ఆప్షన్లు ఉన్నాయి. ఒకేసారి తీసుకోవచ్చు. ప్రతి నెలా 100 నెలా వరకు డబ్బు పొందొచ్చు. రెండింటికి కలిపి కూడా డబ్బులు తీసుకోవచ్చు.

చెల్లించిన ప్రీమియం మొత్తంపై పన్ను ప్రయోజనాలు పొందొచ్చు.