Politics

ఎమ్మార్వో విజయారెడ్డి హత్య.. అసలు నిజాన్ని భయటపెట్టిన సురేశ్ భార్య..!

ఎమ్మార్వో విజయారెడ్డి హత్య ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో పెద్ద సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. భూ వివాదంలో పట్టా కోసం కొంతకాలంగా ఎమ్మార్వో చుట్టూ తిరుగుతున్నా కానీ పట్టించుకోలేదని ఆ కారణం చేత సురేష్ అనే వ్యక్తి ఎమ్మార్వో కార్యాయంలోనే ఎమ్మార్వోపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అయితే ఈ ఘటనలో ఎమ్మార్వో విజయారెడ్డి అక్కడికక్కడే నిప్పులతో కాలీ సజీవ దహనం అయ్యారు. అయితే ఈ సంఘటనలో విజయారెడ్డిని రక్షించేందుకు ప్రయత్నించిన ఆమె డ్రైవర్ కూడా చనిపోయాడు.

అయితే ఎమ్మార్వో విజయారెడ్డి మీద పెట్రోల్ పోసి అంటించిన అనంతరం ఆ మంటలు సురేశ్‌కి కూడా అంటుకున్నాయి. అయితే సురేశ్ దేహం కూడా దాదాపు 65 శాతం కాలిపోయిందని ట్రీట్‌మెంట్‌కి సహకరంచడంలేదని డాక్టర్లు చెప్పగా నిన్న ఉస్మానియా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ సురేశ్ కూడా చనిపోయాడు. అయితే సురేశ్ మృతిపై స్పందించిన ఆయన భార్య లత మీడియా ముందు సంచలన నిజాలు భయటపెట్టింది. లంఛం కోసం తన భర్తను విజయారెడ్డి వేధింపులకు గురిచేసిందని, ఆమె అడిగిన లంఛం కోసం ఇళ్ళు అమ్మి ఇస్తానని చెప్పినా ఆమె వినలేదని, అందుకే ఆమెను భయపెట్టేందుకు తాను ఆత్మహత్యాయత్నం చేస్తానని చెప్పాడని, ఇప్పటి వరకు ఆ భూమి కోసం దాదాపు 9 లక్షలు ఖర్చు పెట్టాడని, అయినా కూడా తనకు భూమి దక్కకుండా చేస్తున్నారని ఆయన ఇలా చేశాడని, ఏ రైతుకు ఇలాంటి కష్టం రాకూడదని వాపోయారు.