ఈ సింగర్స్ ఏ హీరో,హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పుతారో తెలుసా?

గతంలో అందం,అభినయం,వాచకం అన్నీ పుష్కలంగా ఉన్నవారు హీరో హీరోయిన్స్ అయ్యేవారు. నటీనటులు ఎవరైనా సరే, రాణించాలంటే అభినయం,వాచకం ఉండితీరాలి. కానీ రానురాను నటన వచ్చినా,డైలాగులు చెప్పడం రాకపోవడం,అసలు భాష తెలియకపోవడం జరుగుతూ వస్తోంది. దీంతో డబ్బింగ్ ఆర్టిస్టులకు గిరాకీ పెరిగింది. నటనకు తగ్గట్టు డబ్బింగ్ చెప్పడం కష్టమే. కానీ ఇందులో కొందరు సింగర్స్ ఇందులో నిష్ణాతులు. సింగర్ మనో వెండితెరపై రజనీకాంత్ కి తెలుగులో వాయిస్ ఇచ్చాడు. ఇప్పటికీ రజనీకి వాయిస్ ఇస్తున్న మనో అంతటి ఆగకుండా కమల్ హాసన్ కి కూడా కొన్ని సినిమాలకు డబ్బింగ్ ఇచ్చాడు.

టాలీవుడ్ లో తిరుగులేని గాయకుడిగా ఎదిగిన గానగంధర్వ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం వాయిస్ ని లోకనాయకుడు కమల్ కి ఇచ్చాడు. దశావతారం మూవీలో 10పాత్రలకు గాను 7పాత్రలకు బాలు డబ్బింగ్ చెప్పాడు. అన్నమయ్య చిత్రంలో సుమన్ కి డబ్బింగ్ చెప్పి బెస్ట్ మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు అందుకున్నాడు. బాలు సోదరి ఎస్పీ శైలజ కూడా డబ్బింగ్ చెప్పింది. మురారి మూవీలో సోనాలి బింద్రే,నిన్నే పెళ్లాడతా మూవీలో టబుకి అలాగే సంఘవి,శ్రీదేవి తదితరులకు కూడా డబ్బింగ్ చెప్పింది.

పాటలతో అలరించే హేమచంద్ర డబ్బింగ్ రంగంలో దిగి స్నేహితుడు,రాజారాణి తదితర చిత్రాల్లో డబ్బింగ్ చెప్పాడు. అంతేకాదు దృవ మూవీలో నెగెటివ్ క్యారెక్టర్ వేసిన అరవింద్ గోస్వామికి డబ్బింగ్ చెప్పాడు. అలాగే రఘు కుంచె కూడా డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎందరికో వాయిస్ ఇస్తున్నాడు. సదా ,త్రిష ,తమన్నా,మీరా జాస్మిన్,కమిలిని ముఖర్జీ, అనుష్క,శ్రేయ వంటి హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పిన సునీత ఉత్తమ మహిళా డబ్బింగ్ ఆర్టిస్టుగా నంది అవార్డులు అందుకుంది. హీరోయిన్ సమంత కు క్రేజ్ వచ్చిందంటే సింగర్ చిన్మయి డబ్బింగ్ చెప్పడం వల్లనేనని చెప్పాలి. ఏం మాయ చేసావే మూవీకి ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా నంది అవార్డు అందుకుంది. తమిళం,కన్నడ ఇండస్ట్రీస్ లో చాలామందికి ఆమె డబ్బింగ్ చెబుతోంది.