సెట్లో నుంచి కన్నీరు పెట్టుకుంటూ వెళ్లిన నటి జయంతి.. ఎందుకో తెలుసా?
తెలుగు సినిమాల్లో సెంటిమెంట్ పాత్రలకు పెట్టింది పేరుగా నటి జయంతి నిల్చింది. తాజాగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర వార్తలు వెలుగులోకి వచ్చాయి. శ్రీకాళహస్తిలో పుట్టి పెరిగిన జయంతి అసలు పేరు కమల కుమారి. కన్నడ సినీ రంగంలో అడుగుపెట్టి స్టార్ హీరో రాజ్ కుమార్ తో సమానంగా అభిమానులను సంపాదించుకుంది. తెలుగు,కన్నడ,మళయాళ ,హిందీ భాషల్లో నటించిన ఈమె 500సినిమాల్లో నటించారు. జగదేక వీరుని కథ,బొబ్బిలి యుద్ధం,డాక్టర్ చక్రవర్తి, బడిపంతులు,జస్టిస్ చౌదరి,కొండవీటి సింహం,దేవదాస్, కంటే కూతురిని కనాలి, కొదమసింహం స్వాతికిరణం,వంశానికొక్కడు,తదితర సినిమాల్లో చేసింది.
ఇక జయంతి మనవడు తమిళంలో స్టార్ హీరోగా ఉన్నాడు. అతడేజీన్స్ మూవీలో హీరోగా చేసిన ప్రశాంత్ ఇటీవల రామ్ చరణ్ హీరోగా వచ్చిన వినయ విధేయ రామ మూవీలో కూడా నటించాడు. కాగా ఓసారి తమిళ సినిమాలో సావిత్రి తో కల్సి జయంతి నటించారు. జయంతికి తమిళం రాకపోవడంతో రెండుమూడు టేక్స్ తీసుకున్నారు. డైలాగులు చెప్పడంరానివాళ్లను పెట్టి మా సమయం ఎందుకు వృధా చేస్తారని మహానటి సావిత్రి విసుక్కున్నారట. అయితే అందరిలో ఇలా అనేయడంతో అవమానం తట్టుకోలేక కన్నీరు పెట్టుకుంటూ జయంతి సెట్లోంచి బయటకు వచ్చేసారట. అయితే కొన్నాళ్ల తర్వాత కన్నడ లో జయంతి లీడ్ రోల్ లో నటిస్తుంటే,ఆమె తో కల్సి సావిత్రి నటించారట.
అప్పుడు సావిత్రి కాళ్లకు జయంతి నమస్కారం చేస్తూ,ఆరోజు మీరన్న మాటలతో తమిళం నేర్చుకున్నానని చెప్పారట. దీంతో సావిత్రి అప్పట్లో తాను అన్నమాటలకు ఎంతో బాధపడ్డారట. అప్పట్లో అన్న మాటలను మనసులో పెట్టుకోకుండా ఇపుడు ఇలా కాళ్లకు నమస్కారం చేసిన జయంతి వినమ్రతకు అందరూ ఆశ్చర్యపోయారట. అప్పట్లో ఎలాంటి భేషజం లేకుండా సీనియర్ నటుల పట్ల గౌరవంతో ,జూనియర్స్ పట్ల ప్రేమతో ఉండేవారని,అందుకే అప్పటి నటులు ఎక్కువకాలం రాణించారని ఓ సీనియర్ జర్నలిస్ట్ వ్యాఖ్యానించారు.