నన్నెవ్వరు అడ్డుకుంటారో చూస్తా…? సవాల్ విసిరిన నాగబాబు…

రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసమని రాష్ట్రంలోని అమరావతి ప్రాంత రైతులందరూ కూడా పోరాటం చేస్తున్న తరుణంలో, రైతులందరికీ మద్దతుగా ఉంటూ, వారికి సానుభూతి తెలిపేందుకు అమరావతి ప్రాంతాల్లో పలు గ్రామాల్లో పర్యటించడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పలువురు కీలక నేతలు అందరు కూడా నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో తమ పర్యటనను అడ్డుకోవడం అనేది పోలీసులకు భావ్యం కాదని జనసేన పార్టీ కీలక నేత నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు మంగళగిరిలోని జనసేన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగబాబు మాట్లాడుతూ, పలు కీలక వాఖ్యలు చేశారు.

కాగా రాజధాని అమరావతి ప్రాంతంలోని రైతులందరికీ కూడా సానుభూతి తెలపడం అనేది తమ బాధ్యత అని, ఈ విషయంలో ఎవరెన్ని కుట్రపూరిత చర్యలు చేపట్టినప్పటికీ కూడా తమ నిర్ణయం మార్చుకునేది లేదని నాగబాబు స్పష్టం చేశారు. ఇకపోతే తమని గ్రామాల్లో పర్యటించకుండా ఎవరు అడ్డుకుంటారో చూస్తాం అంటూ నాగబాబు సవాల్ విసిరారు… అయితే ఈ విషయంలో జనసేన నేతలెవ్వరూ కూడా వెనక్కి తగ్గకపోవడంతో జనసేన పార్టీ కార్యాలయం చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పాలి.

error: Content is protected !!