త్వరలో కనుమరుగు అవుతున్న టాలీవుడ్ హీరోలు

మొదట్లో సూపర్ హిట్స్ తో దూసుకెళ్లి ఆతర్వాత ప్లాప్ లు వెంటాడడంతో ఒక్క హిట్ ఉంటే చాలు అని ఎదురుచూస్తున్నారు. సినిమా రంగంలో ఇలాగే ఉంటుంది. ఎప్పుడు హిట్ కొడతారో ,ఎప్పుడు డిజాస్టర్లతో కుదేలవుతారో ఎవరూ చెప్పలేరు. మారుతున్న కాలంతో పాటు మారకపోవడం,సగటు ఆడియన్స్ నాడిని పట్టుకోవడంలో మిస్సవ్వడం వలన ఇలా దెబ్బ మీద దెబ్బ పడుతోందా అనేది తెలియడం లేదు. నితిన్,సందీప్ కిషన్,ఆది,సుధీర్ బాబు,నారా రోహిత్,నిఖిల్ ,అల్లరి నరేష్ ఇలా చాలా జాబితాయే ఉంది. వీళ్లకు హిట్ పడడం లేదు. స్వయంకృతమో,తగిన జాగ్రత్తలు పాటించకపోవడమో , టైం కల్సి రాకపోవడమో ఏమో గానీ హిట్స్ కొట్టి కూడా ఒక్కసారిగా కెరీర్ ముందుకు సాగడం లేదు.

అల్లరి నరేష్ మొదట్లో వరుస హిట్స్ తో దూసుకెళ్లాడు. అయితే తర్వాత ప్లాప్ మీద ప్లాప్ రావడంతో మహర్షి మూవీలో మంచి సపోర్టింగ్ రోల్ దొరకడంతో యాక్ట్ చేసి తానేమిటో నిరూపించుకున్నాడు. అయితే షూటింగ్ దశలో గల బంగారాబుల్లోడు మూవీపైనే ఆశలు పెంచుకున్నాడు. అ ఆ మూవీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో రావడంతో సూపర్ హిట్ అందుకుని నితిన్ 50కోట్ల క్లబ్ లో చేరాడు. ఇక తర్వాత హిట్స్ లేవు. తాజాగా తీస్తున్న భీష్మ మూవీపైనే ఆశలు పెట్టుకున్నాడు. నిఖిల్ పరిస్థితి కూడా ఏమీ బాగోలేదు. కార్తికేయ 2పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. నవదీప్,వరుణ్ సందేశ్ లకు హిట్ మూవీస్ దక్కడం లేదు.

ఇక సందీప్ కిషన్ వరుస పరాజయాలు మూటగట్టుకుని హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. నిను వీడను నీడను నేను మూవీతో కొంత రిలీఫ్ వచ్చినా సూపర్ హిట్ రావాల్సి ఉంది. డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు అది నటించిన జోడి,బుర్రకథ మూవీస్ దెబ్బతినడంతో హిట్ కోసం వేచిచూస్తున్నాడు. నారా రోహిత్ నటన బాగున్నా సరే, సినిమాలు ఇలా వచ్చి అలా పోవడంతో ఎప్పుడు బ్రేక్ దొరుకుతుందా అని ఎదురుచూస్తున్నాడు. ఇక సుధీర్ బాబు కూడా ఇదే డైలమాలో ఉన్నాడు. పుల్లెల గోపీచంద్ బయోపిక్,వి మూవీస్ పై దృష్టిపెట్టిన సుధీర్ గట్టెక్కుతాడా లేదా అని తేలాలి.

error: Content is protected !!