Politics

ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుకు ఆర్డినెన్స్‌ తీసుకు వచ్చే అవకాశం ఉందా?

రాజధాని వికేంద్రీకరణ బిల్లును మండలిలో అడ్డుకుని దాన్ని చైర్మన్‌ సెలక్షన్‌ కమిటీకి పంపిన విషయం తెల్సిందే.దాంతో ప్రస్తుతం జగన్‌ తన మంత్రులతో భేటీ అయ్యి చర్చలు జరుపుతున్నాడు.

పలువురు మూడు రాజధానులకు గాను ఆర్డినెన్స్‌ తీసుకు రావాలని సలహా ఇస్తున్నారు.మంత్రుల సలహాపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్న జగన్‌కు అది సాధ్యం కాదని యనమల అంటున్నాడు.మండలి సెలక్షన్‌ కమిటీకి పంపించిన బిల్లుకు ఆర్డినెన్స్‌ ఎలా తీసుకు వస్తారని, అది సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్దమంటూ యనమల అన్నాడు.

ప్రభుత్వం ప్రస్తుతానికి వెచి చూడాలి తప్ప మరేం చేసినా కూడా న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మండలి చైర్మన్‌ సెలక్షన్‌ కమిటీకి పంపించిన తర్వాత ఆయన నిర్ణయాన్ని తిరష్కరించినట్లయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, న్యాయపరమైన చిక్కుల్లో పడటంతో పాటు పరిపాలన విషయంలో సుప్రీం కోర్టు జోక్యం వరకు కూడా వెళ్తుందని ఈ సందర్బంగా న్యాయ నిపుణులు జగన్‌ను హెచ్చరిస్తున్నాడు.అందుకే జగన్‌ కూడా ఆర్డినెన్స్‌ విషయమై ఆసక్తిగా లేడని అంటున్నారు.