Sports

ఈ క్రికెట్ కామెంటేటర్స్ జీతం ఎంతో తెలుసా? ఒక్క మ్యాచ్ కి ఎంత ఇస్తారు ?

క్రికెట్ ఆట గురించి బాగా అవగాహన ఉండడం వలన కామెంటేటర్స్ మ్యాచ్ జరిగేటప్పుడు సందోర్భిచితంగా ఆయా అంశాలు చెబుతుంటారు. బంతిని విసిరిన తీరు,బాట్ ని ఝళిపించిన విధానం,ప్రత్యర్థులపై ఎలాంటి ప్రతిభ కనబరచాలి వంటి విషయాలపై వ్యాఖ్యాతలు వివరిస్తుంటారు. ఆటగాళ్ల గురించి,అంతకుముందు వారు సాధించిన రికార్డుల గురించి వారికొక అవగాహన కూడా వ్యాఖ్యాతలకు ఉంటుంది కనుక అన్నీ విడమరిచి చెప్పగలుతారు. ఈవిధంగా ఆటను రక్తికట్టించేలా వివరించడం వలన వీక్షించే వారికి ఇంకా ఉత్సాహంగా ఉంటుంది.

ఆయా దేశాల్లో ఏటా క్రికెట్ మ్యాచ్ లు జరుగుతూ ఉంటాయి. క్రికెట్ సంఘాలు,,స్పోర్ట్స్ ఛానల్స్, ప్రత్యేకంగా వ్యాఖ్యాతలను నియమిస్తారు. 35ఏళ్ళు దాటిన క్రికెటర్స్ రిటైర్మెంట్ తీసుకోవడం వలన వాళ్ళే వ్యాఖ్యాతలుగా అవతారం ఎత్తుతుంటారు. సంజయ్ మంజ్రేకర్ , హర్ష , సునీల్ గవాస్కర్ ,అనిల్ కుంబ్లే,రాహుల్ ద్రావిడ్,సౌరవ్ గంగూలీ,వివిఎస్ లక్ష్మణ్ ,సెహ్వాగ్ లు వ్యాఖ్యాతలుగా బాగా రాణిస్తున్నారు. ఇక తాజాగా ప్రపంచ కప్ కి సచిన్ కూడా వ్యాఖ్యాతగా ఎంట్రీ ఇచ్చాడు. భారత క్రికెట్ కోచ్ ,మాజీ కెప్టెన్ రవిశాస్త్రి 2017వరకూ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. అధిక రెమ్యునరేషన్ అందుకున్న వ్యాఖ్యాతగా నిలిచాడు. ఒక్కో సిరీస్ కి 57లక్షలు అందుకున్నాడు.

ఐపీఎల్ టోర్నీ ఒక్కోదానికి నాలుగు కోట్లు తీసుకునేవాడు. ఈవిధంగా ఏడాదికి 6న్నరకోట్ల రూపాయలు కామెంటరీ ద్వారా సంపాదించేవాడు. ఇక సంజయ్ మంజ్రేకర్ ,సునీల్ గవాస్కర్ లు ఎక్కువ మొత్తాన్ని అంటే ఏడాదికి ఆరేసి కోట్లు ఆర్జిస్తున్నారు. బిసిసిఐ 2015లో సౌత్ ఆఫ్రికాలో జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్ లకు గాను 36లక్షల 49వేలు సంజయ్ కి చెల్లించింది. అనిల్ కుంబ్లేకు దక్షిణఆఫ్రీకా సిరీస్ లో 5వన్డేలు,నాలుగు టెస్ట్ మ్యాచ్ లకు గాను 39లక్షలు చెల్లించింది.