Movies

ఒట్టేసి చెప్తున్నా’ సినిమా హీరోయిన్ గుర్తుందా?ఈమె పెళ్లి చేసుకున్న భర్త,కొడుకు ఎలా ఉన్నారో తెలుసా?

హీరోయిన్స్ స్టార్ డమ్ వున్నప్పుడు ఎడా పెడా సంపాదించేసి,ఛాన్స్ లు తగ్గుతున్నపుడు పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడం చూస్తున్నాం. అయితే ఇలా పెళ్లి చేసుకున్నవాళ్ళు కొన్నాళ్ళకు సెకండ్ ఇన్నింగ్స్ పేరిట అమ్మా,వదిన,అత్తపాత్రల్తో ఆడియన్స్ ముందుకి వస్తున్నారు. అయితే కొందరు పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. అందులో మలయాళీ నటి కనిక ఒకరు. తెలుగులో 2003లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన ఒట్టేసి చెబుతున్నా మూవీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత నా ఆటోగ్రాఫ్ మూవీలో చేసింది.

తెలుగులో కేవలం రెండు సినిమాలు మాత్రమే చేసిన ఈ మలయాళీ కుట్టి చూడ్డానికి హోమ్లీ గా ,క్యూట్ గా ఉంటుంది. అందుకే రెండు సినిమాలే అయినా తెలుగులో అప్పట్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మలయాళంలో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ డమ్ తెచ్చుకుంది. అలాగే తమిళ,కన్నడ భాషల్లో కూడాచేసింది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే శ్యాం రాధాకృష్ణ అనే ఎన్నారై సాఫ్ట్ వేర్ ని ప్రేమించి , పెళ్ళాడి ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్ళిపోయింది.

అయితే ఇన్నాళ్లూ కనిపించకుండా పోయిన ఈ భామ తాజాగా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయడంతో మళ్ళీ ఈమె గురించి చర్చ మొదలైంది. కనిక దంపతులకు సాయి ఋషి అనే ఓ కొడుకు ఉన్నాడు. భర్త ,కొడుకుతో ఉన్న ఫోటోను ఇంస్టాగ్రామ్ ద్వారా అప్ డేట్ చేసిన ఈమె మాలయంలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది. మరి తెలుగులో కూడా రీ ఎంట్రీ ఇస్తుందా లేదా అనేది చూడాలి.