టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇస్తున్న అకిరా…లాంచ్ ఎవరు చేస్తున్నారో తెలుసా?

మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటి వరకు చాలా మంది హీరోలు వచ్చారు. అయితే మెగా స్టార్ తనయుడైన రామ్ చరణ్ చిరుత చిత్రం తో ఎంట్రీ ఇచ్చి చిరంజీవి లా మాస్, క్లాస్ ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాడు. ఇక రెండో సోదరుడు నాగబాబు సినిమాల్లో అంతగా రాణించలేకపోయినా తన కొడుకు వరుణ్ తేజ్ తో ఆ లోటు భర్తీ చేసుకున్నాడు. వరుణ్ తేజ్ వరుస బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో ఇండస్ట్రీ లో దూసుకుపోతున్నాడు. అయితే మెగా, పవర్ అభిమానులు ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న హీరో పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా ఎంట్రీ ఫై త్వరలో ఒక స్పష్టత రానుంది.

పవన్ కళ్యాణ్ కి ఎంతటి క్రేజ్ ఉందొ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పింక్ రీమేక్ తో పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ ల కొడుకైన అకిరా లాంచ్ ఫై పవన్ అభిమానులు మాత్రమే కాకుండా మెగా అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రామ్ చరణ్ అకిరా ని లాంచ్ చేయనున్నట్లు సమాచారం. రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నుండి తీయబోయే సినిమాలో అకిరా వెండి తెరకు పరిచయం కానున్నారు. మరి దీని ఫై అధికారిక ప్రకటన ఎపుడు ఉంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

error: Content is protected !!